ప్రతినిత్యం వేలాది వాహనాలు.. వందకుపైగా వేగంతో రయ్యుమంటూ దూసుకెళ్లే జాతీయ రహదారి–44పై బ్రిడ్జిల నిర్మాణ పనులు నత్తకు నడక నేర్పుతున్నాయి.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తూరు నుంచి అలంపూర్ వరకు సుమారు 180 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ రహదారిపై అక్కడక్కడ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టారు.. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వంతో ఆయా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. కొన్నిచోట్ల ఒకే దారిలో
ఇరువైపులా వాహనాలు వస్తుండటంతో గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తుండటంతో.. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లేవారు, అధికారిక విధుల్లో వెళ్లేవారు, ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. – అడ్డాకుల/రాజాపూర్
కొత్తూరు
షాద్‌నగర్
క్రాస్‌రోడ్డు
రాయికల్
టోల్‌ఫ్లాజా
● బాలానగర్, రాజాపూర్ వద్ద ప్రతిరోజు అరగంట, గంటపాటు వాహనాలు నిలిచిపోతున్నాయి. ఇక్కడ అండర్ బ్రిడ్జిల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.
● మూసాపేట మండలం వేముల స్టేజీ వద్ద ఏడాదిన్నర కిందట పనులు మొదలైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. దీనికితోడు ఇక్కడ సర్వీస్ రోడ్లను అరకొరగా చేపట్టడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్ వైపు ఒక సర్వీస్ రోడ్డుపై కంకర వేసి వదిలేశారు. ఈ రోడ్డుపై వాహనాలు వెళ్తే దుమ్ముతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. అలాగే హనుమాన్ విగ్రహం వద్ద కూడా సర్వీస్ రోడ్డు అస్తవ్యస్తంగా మారింది.
బాలానగర్
బాలానగర్‌లో ఫ్లైఓవర్ నిర్మాణ పనుల వల్ల నిలిచిన వాహనాలు
ఉమ్మడి జిల్లాలో ఎన్‌హెచ్–44పై ప్రయాణం సాఫీగా సాగడం లేదు. కొన్నాళ్ల నుంచి హైవేపై అండర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు సాగుతుండటమే ఇందుకు కారణమవుతోంది. బ్రిడ్జి నిర్మాణం జరిగే చోట పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయడం లేదు. దీంతో పనులు నెలల తరబడిగా సాగుతుండటంతో ప్రతిరోజు ట్రాఫిక్ కష్టాలు వాహనదారులకు చిరాకు తెప్పిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో కొత్తూరు నుంచి అలంపూర్ వరకు ఎన్‌హెచ్–44 సుమారు 180 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అయితే జాతీయ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరిగే చోట బ్లాక్ స్పాట్లుగా గుర్తించి అక్కడ అండర్ బ్రిడ్జిల నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని బాలానగర్, రాజాపూర్, భూత్పూర్ మండలం శేర్‌పల్లి, మూసాపేట మండలం పోల్కంపల్లి స్టేజీ, జానంపేట, వేముల స్టేజీ, వనపర్తి జిల్లా పరిధిలోని పెద్దమందడి మండలం వెల్టూర్ స్టేజీ, కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద అండర్ బ్రిడ్జిల పనులు చేపడుతున్నారు. ఇందులో బాలానగర్, రాజాపూర్, వేముల స్టేజీ వద్ద సుమారు ఏడాదిన్నర కిందట పనులు మొదలయ్యాయి. కాగా.. హైవేపై పనులు జరిగే చోట తీసుకోవాల్సిన కనీస రక్షణ చర్యలను కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు. రోడ్డు పనులు జరిగే చోట అవసరమైన ప్రాంతాల్లో నిబంధనలు పాటించడం లేదు. పనులు జరిగే ప్రదేశాల్లో సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో సర్వీస్ రోడ్లు సక్రమంగా కనిపించడం లేదు. దీంతో వాహనాలు వరుస క్రమంలో ఢీకొంటున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీనికి తోడు నిత్యం ట్రాఫిక్ తంటాలతో ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాహనదారులు, ప్రయాణికులు వాపోతున్నారు.
ముద్దిరెడ్డిపల్లి
క్రాస్‌రోడ్డు
పోలేపల్లి
జడ్చర్ల
దివిటిపల్లి
భూత్పూర్
వేముల స్టేజీ
అడ్డాకుల
టోల్‌ఫ్లాజా
● పోల్కంపల్లి స్టేజీ, వెల్టూరు స్టేజీల వద్ద సర్వీస్ రోడ్ల పనులే చేయిస్తున్నారు. ఇక్కడ వాహనాలు ప్రధాన రోడ్డుపైనే వెళ్తున్నాయి. వెల్టూర్ స్టేజీ వద్ద సర్వీస్ రోడ్ల పనులు నత్తనడకను తలపిస్తున్నాయి.
● కనిమెట్ట వద్ద సర్వీస్ రోడ్లు పూర్తి కాగా అండర్ బ్రిడ్జి పనులు సాగుతున్నాయి. వాహనాలు సర్వీస్ రోడ్లపైనే వెళ్తున్నాయి. భూత్పూర్ మండలం శేర్‌పల్లి(బీ) వద్ద కర్నూలు వైపు సర్వీస్ రోడ్డు పూర్తికాగా.. వాహనాలు దానిపైనే వెళ్తున్నాయి. హైదరాబాద్ వైపు వెళ్లే సర్వీస్ రోడ్డు పూర్తి కాలేదు. అండర్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి.
కనిమెట్ట
పాలెం
బాలానగర్, రాజాపూర్ వద్ద
నిత్యం ట్రాఫిక్ కష్టాలు
వేముల స్టేజీ వద్ద నెలల తరబడిగా
సాగుతున్న పనులు
హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు నరకప్రాయంగా ప్రయాణం
గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకొని వాహనదారుల అవస్థలు


