సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

Jul 14 2026 1:06 AM | Updated on Jul 14 2026 1:06 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: దివిటిపల్లి ఐటీ పార్కులోని అమరరాజా గిగా కారిడార్‌ పరిధిలో ఏర్పాటు చేసిన కస్టమర్‌ క్వాలిఫికేషన్‌ ప్లాంట్‌ (సీక్యూపీ) ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 15న రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల ను సోమవారం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, టీజీఐఐసీ వీసీ–ఎండీ కె.శశాంక, కలెక్టర్‌ ఖుష్బూగుప్తా వేర్వేరుగా క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా సీఎం హెలికాప్టర్‌ దిగే స్థలం, సభాస్థలి తదితర ప్రాంతాలను తనిఖీ చేసి అధికారులకు తగు సూచనలిచ్చారు. అలాగే కంపెనీ ప్రతినిధులతో చర్చించి ఏర్పాట్లపై తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే యెన్నం మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో శిక్షణ అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాయిశివాని, ఆర్డీవో నవీన్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్‌ కె.లక్ష్మణ్‌యాదవ్‌ పాల్గొన్నారు.

ప్రతి కేసులో బాధితులకు సత్వర న్యాయం జరగాలి

మహబూబ్‌నగర్‌ క్రైం: ప్రతి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై సదరు స్టేషన్‌ అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని ఎస్పీ డి.జానకి అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి బాధితులు హాజరై పలు సమస్యలపై ఫిర్యాదులు అందించారు. ఒక్కో ఫిర్యాదును పరిశీలించిన ఎస్పీ ఆయా స్టేషన్‌ అధికారులతో మాట్లాడి కేసుల పురోగతిపై ఆరా తీశారు. ప్రతి కేసులో బాధితులకు సత్వ ర న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్‌శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement