జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజావాణిలో వ చ్చిన దరఖాస్తులను పరిశీలించి నిర్లక్ష్యం చేయకుండా సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులకు ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యా దులు స్వీకరించారు. అనవసరంగా పెండింగ్‌లో పెట్టవద్దని సూచించారు. మున్సిపల్, పంచాయతీరాజ్, వ్యవసాయం, పౌరసరఫరాల శాఖ, భూ సర్వే రికార్డులు, గృహ నిర్మాణం, రోడ్డు రవాణా, పోలీస్, గిరిజన అభివృద్ధి శాఖ, ప్రణాళిక శాఖ, విద్యుత్ శాఖ, విద్య, వైద్య ఆరోగ్యం, అటవీ, గ్రామీణ అభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన వినతులను అధికారులు స్వీకరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు మధుసూదన్‌నాయక్, హరిప్రియ, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, జెడ్పీసీఈఓ వెంటక్‌రెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు పాల్గొన్నారు.
‘మా తండాను కబ్జా నుంచి కాపాడాలి’
తువ్వగడ్డ తండాను మాజీ సర్పంచ్ హరిచందర్ కబ్జా చేశారు. మా తండాకు చెందిన 16 ఎకరాల భూమిని ఆయన కబ్జా చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి వెళ్తే ఆయన రానివ్వడం లేదు. నాలుగేళ్ల నుంచి తిరుగుతున్నా.. అధికారులు స్పందించడం లేదు. మాకు న్యాయం చేసేదాక పోరాటం చేస్తాం.
– తువ్వగడ్డతండా, మునిమోక్షం,
హన్వాడ మండలం
ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలి
ఇల్లు కట్టుకునేందుకు నాకు ప్లాటు ఉంది. ఇందిరమ్మ ఇంటికోసం అధికారుల వద్దకు పోతే ఇది వరకే ప్రభుత్వ లబ్ధి పొందావు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు రాదని చెబుతున్నారు. కట్టని ఇల్లు మంజూరైందని.. బిల్లు కూడా అందిందని అధికారులు చెబుతున్నారు. నాకు ఎలాంటి ఇల్లు మంజూరు కాలేదు. అధికారులు స్పందించి నాకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలి.
– దాసరి నర్సింహులు, సీసీకుంట
మౌలిక వసతులు కల్పించాలి..
పాలకొండ శివారులోని శ్రీరామకాలనీ గోనెల నగర్‌లో కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కాల్వలు లేక మురుగు నీళ్లు రోడ్లపై పారుతూ ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది. సీసీరోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వానకాలంలో రోడ్లపై నీళ్లు కుంటగా మారి దోములు, ఈగలకు నెలవుగా మారుతుంది. వెంటనే సీసీరోడ్లు వేయడంతో పాటు డ్రెయినేజీలను నిర్మించాలి. –బీసీ సంక్షేమ సంఘం నాయకుడు
వెంకట్రాములు, శ్రీరామకాలనీ


