మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లోని కొల్లూర్‌లో ఆదివారం జరగనున్న రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల(అండర్–10, అండర్–12, అండర్–14 ) అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులు శనివారం తరలివెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో క్రీడాకారులను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.శరత్‌చంద్ర అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, సీనియర్ పీడీలు తదితరులు పాల్గొన్నారు.
అథ్లెటిక్స్ క్రీడాకారులు: సహస్ర (స్టాండింగ్ లాంగ్‌జంప్), నక్షత్ర (60మీ, 200మీ. పరుగు), ఎం.వేద (200మీ., 60మీ.పరుగు), వి.భవిష్య (60మీ, 200మీ. పరుగు), రియా తనాజ్ (లాంగ్‌జంప్, 200మీ. పరుగు), మహా శేరిపల్లి (లాంగ్‌జంప్), వ్రిందయాదవ్ (300మీ., 60మీ. పరుగు), సాయిషన్వి (60మీ, 300మీ. పరుగు), వి.రిత్విక (ట్రైథలాన్), సమన్వి క్రిష్ణ (ట్రైథలాన్, కిడ్స్ జావెలిన్), వి.నిహాల్‌కుమార్ (స్టాండింగ్ లాంగ్‌జంప్), సిద్ధార్థ అనుపటి (200మీటర్ల పరుగు), అయాన్ ముద్దని (200మీ., 60మీ. పరుగు), మనోజ్ కుమార్ యాదవ్ (60మీ., 200 మీ. పరుగు), మణి అర్జున్ (లాంగ్‌జంప్, 200 మీ.పరుగు), శ్రీవర్షిత్ యాదవ్ (60మీ., 200మీ. పరుగు)


