జనాభా కట్టడిలో అందరూ బాధ్యతగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

జనాభా కట్టడిలో అందరూ బాధ్యతగా ఉండాలి

Jul 11 2026 12:54 AM | Updated on Jul 11 2026 12:54 AM

పాలమూరు: తల్లిదండ్రులు ఒక సంతానం తర్వాత మరో బిడ్డ ప్రసవం కోసం కనీసం మూడేళ్లయినా విరామం తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రీనివాసులు అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పాత డీఎంహెచ్‌ఓ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం బండ్లగేరి కూడలి దగ్గర భారీ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనాభా కట్టడికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈనెల 13న నిర్వహించే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో 1 నుంచి 19 ఏళ్ల బాలబాలికలకు తప్పకుండా అల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్‌ అధికారులు శంకర్‌, శివకాంత్‌, పులి విద్య, మెడికల్‌ ఆఫీసర్లు రాఘవేందర్‌, తస్లీమా ఫర్హాత్‌, మమత, ప్రియాంక, సిబ్బంది హన్మంతు, సుభాష్‌ పాల్గొన్నారు.

● మండల పరిధిలో ఉన్న మణికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, కోయిలకొండ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు తనిఖీ చేశారు. స్థానికంగా అందుతున్న వైద్యసేవలపై ఆరా తీసి, రోగులతో మాట్లాడి సమస్యలపై తెలుసుకున్నారు. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచడానికి వైద్యులు మరింత కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్‌ శరత్‌బాబు, నాగరాజు, అర్చన, అరుణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement