కేటీదొడ్డి: రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరి యా బుకింగ్ మరింత సులభంతరం చేసేందు కు ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుందని జోగుళాంబ గద్వాల జిల్లా ఈడీఎం శివకుమార్ పేర్కొన్నారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల్లో యూరియా బుకింగ్ సేవల ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ఫర్టిలైజర్ యాప్ ద్వారా బుక్ చేసుకోలేని రైతులు మీసేవ సెంటర్లో బుకింగ్ చేసుకోవాలని ఈ కొత్త విధానాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పర్యవేక్షణలో మీసేవ, వ్యవసాయ శాఖతో కలిసి ప్రారంభించినట్లు తెలిపారు.
– ఈడీఎం శివకుమార్


