శాఖల విభజనతో సమస్యలు ఉత్పన్నం
● పోలీసు, వైద్యం ఇక్కడ...
● రెవెన్యూ, రూరల్ డెవలప్‌మెంట్ అక్కడ..
● రెండు జిల్లాల మధ్య
కొనసాగుతున్న పాలన
నవాబుపేట: గతంలో కొత్త మండలాలు ఏర్పాటు చేస్తున్న తరుణంలో జిల్లా కేంద్రం తమకు అందుబాటులో ఉంటుందని అప్పటి రంగారెడ్డి జిల్లా పరిధిలోని మరికల్, చాకలపల్లి, మల్కపూర్, కొత్తపల్లి, కల్మన్‌కల్వ, చిన్నమేగ్యనాయక్‌తండా, కొత్తపల్లితండా, పుర్సంపల్లి, లింగన్నపల్లి, కిష్టంపల్లి, బంగ్రంపల్లి గ్రామాలు పాలమూరు జిల్లా నవాబుపేట మండలంలో చేరాయి. కాగా చేరిన ఐదేళ్లకే రాజకీయ సమీకరణాలతో తమను తిరిగి పాత జిల్లాలో కలపాలని అక్కడి నేతలను పట్టుబట్టిన ప్రజలు తిరిగి పాత జిల్లాకు వెళ్లిపోయారు. కాగా నాటి నుంచి పాలన పరంగా విలీన గ్రామాలకు చిక్కులు వీడటం లేదు.
శాఖల విభజనతో సమస్యలు..
మొదట్లో కేవలం పేరుకే విలీనంగా ఉండగా మూడే ళ్ల క్రితం విద్యాశాఖ అక్కడి ఆధీనంలోకి వెళ్లగా మిగతా శాఖలు పాలమూరు జిల్లాలోనే కొనసాగా యి. అనంతరం రెవెన్యూ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు గతేడాది అక్కడికి మారింది. కాగా నేటికి ప్ర ధానమైన రెండు శాఖలు ఇక్కడే ఉండటంతో అక్క డి ప్రజల బాధలు అన్నీ ఇన్నికావు. ప్రధానమైన పోలీసు, వైద్య శాఖలు నవాబుపేట మండలంలోనే కొనసాగుతుండగా ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూకు సంబంధించిన భూముల వ్యవహారం వికారబాద్ జిల్లా పరిధిలో ఉండగా భూముల వ్యవహారంలో గొడవలు జరిగి తే పాలమూరు జిల్లా పరిధి పోలీసు శాఖ పరిధిలో ఉంది. అటు వైద్యానికి సైతం ఇబ్బందులు వస్తున్నా యని ప్రజలు వాపోతున్నారు. ఇబ్బందులు ఉన్నా యనే విలీనమైన ఐదేళ్లకు వెనక్కి వెళ్లినా కూడా విలీన చిక్కులు వీడటం లేవని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో వెంటనే అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
మరికల్ గ్రామం


