వర్మీ కంపోస్టు ఎరువు
జీలుగ ఎరువు
అలంపూర్: సేంద్రియ ఎరువులలో పోషకాలు మెండుగా ఉంటాయి. పంటలకు శక్తిని ఇస్తాయి. పంటల సాగులో సహజ ఎరువులను వాడటం వల్ల పంట దిగుబడి అధికంగా ఉంటుంది. నేల సారం పెరుగుతుంది. రైతులకు పెట్టుబడి తగ్గుతుంది. ప్రస్తుతం రైతులు పంటల సాగులో రసాయనిక ఎరువులు అధికంగా వినియోగిస్తున్నారు. దీంతో పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గి నష్టపోతున్నారు. రసాయనిక ఎరువులతో కలిగే నష్టాలను ఏఓ నాగార్జున రెడ్డి రైతులకు అవగాహన కోసం పలు విషయాలను వెల్లడించారు. రసాయనిక ఎరువు లు తగ్గించి వాటి స్థానంలో పశువు లు, గొర్రెలు, మేకల, కోళ్ల ఎరువు లు, వేప కానుగలాంటి వృక్ష సంబంధిత ఎరువులు వర్మి, పచ్చి రొ ట్ట ఎరువులు వేయాలని సూచిస్తున్నారు. నేల సంరక్షణ కుసేంద్రియ పోషకాల అవసరం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. భూమిలో పోషకాల లభ్యతకు అనుగుణంగా ఎరువుల యాజమాన్యం చేప ట్టాలి.సేంద్రియ ఎరువుల్లో స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరం, పోటాషియం శాతం ఎంత ఉంటుందో తెలిపారు.
సేంద్రియ ఎరువులు నత్రజని భాస్వరం పోటాష్ శాతం శాతం శాతం
పశువుల ఎరువు 1.5 0.9 1.9
కోళ్ల ఎరువులు 3.0 2.0 2.0
గొర్రెల/మేకల ఎరువులు 0.7 0.6 3.0
వర్మీ కంపోస్టు 3.0 2.2 1.7
చెరుకు మడ్డి 1.5 4.5 7.0
గోబర్ గ్యాస్ ప్లాంట్ ఎరువు 2.4 1.5 1.0
గ్రామీణ కంపోస్టు 1.0 0.8 1.2
పట్టణ కంపోస్టు 2.0 3.3 2.0
వేరుశనగ పిండి, చెక్క 7.5 1.3 1.5
వేప పిండి 5.6 1.1 1.5
ఆముదం పిండి 4.4 1.9 1.4
కానుగ పిండి 4.0 1.0 1.4
పత్తి గింజల పిండి 3.6 2.5 1.6
పంది ఎరువు 3.75 3.13 2.5
జీలుగ 0.62 0.15 0.46
జనుము 0.75 0.12 0.15
చేపల పొట్టు 4.1 3.1 0.3
అలసంద 0.71 0.15 0.58
పిల్లి పెసర 0.72 0.10 0.53
పెట్టుబడి స్వల్పం దిగుబడి అధికం
నేల సంరక్షణతో పంటల ఆరోగ్యం
పాడి–పంట


