మహబూబ్‌నగర్ క్రైం: హైదరాబాద్ మల్కాజ్‌గిరి కమిషనరేట్‌లో ఈనెల 7నుంచి 9వరకు జరిగిన రాష్ట్ర 5వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ సిబ్బంది వివిధ క్రీడ విభాగాల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఆర్మ్ రెజ్లింగ్, పవన్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో అడ్డాకుల మహిళ కానిస్టేబుల్ రాధిక మూడు పతకాలు సాధించారు. బాడీ బిల్డింగ్ విభాగంలో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ రజత పతకం సొంతం చేసుకున్నాడు. యోగా విభాగంలో భూ త్పూర్ కానిస్టేబుల్ రాము రజతం, బాక్సింగ్‌లో ట్రాఫిక్ పీఎస్ కానిస్టేబుల్ షోయబుద్దీన్ కాంస్య పతకం సాధించాడు. రాష్ట్ర స్థాయిలో క్రీడ పోటీల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ డి.జానకి అభినందించారు.
తండ్రి మందలించాడని.. కొడుకు బలవన్మరణం
మహబూబ్‌నగర్ క్రైం: స్నేహితులతో కలిసి గోవా టూర్ వెళ్లి న క్రమంలో కా రుకు జరిగిన రో డ్డు ప్రమాదంలో కారు దెబ్బతింది. దీంతో కారుకు మరమ్మతులు చేయడానికి తండ్రిని డబ్బులు అడగటంతో మందలించాడు. దీంతో మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని తెలుగు గూడెంకు చెందిన కర్ణ గణేష్(23) గురువారం జమిస్తాపూర్ సమీపంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి గణేష్ చౌదర్‌పల్లి సమీపంలో ఉన్న పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. వారం క్రితం గ్రామానికి చెందిన స్నేహితులతో కలిసి గోవాకు కారులో టూర్ వెళ్లారు. గోవాకు వెళ్తున్న సమయంలో కర్ణాటకలో సిద్నాపూర్ దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైంది. స్వల్ప గాయాలతో బయటపడిన వీరందరూ గ్రామానికి చేరుకున్నారు. దీంతో కారుకు మరమ్మతులు చేయడానికి డబ్బులు అవసరమై తండ్రికి చెప్పడంతో ఆయన మందలించాడు. దీంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి తండ్రి రామచంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


