పోక్సో కేసులో పదేళ్ల జైలుశిక్ష | - | Sakshi
Sakshi News home page

పోక్సో కేసులో పదేళ్ల జైలుశిక్ష

Jul 8 2026 1:14 AM | Updated on Jul 8 2026 1:14 AM

రాజోళి: వడ్డేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై జరిగిన లైంగికదాడి ఘటనలో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష ఖరారైనట్లు శాంతిగనర్‌ ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి తెలిపారు. వివరాలిలా.. 2021లో వడ్డేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై గ్రామానికి చెందిన నడిపి తిమ్మప్ప లైంగికదాడికి పాల్పడినట్లు బాలిక తల్లి శాంతిగనర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. అప్పటి ఎస్‌ఐ శ్రీహరి కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ వెంకటేశ్వర్లు విచారణ చేపట్టి నిందితుడిని రిమాండ్‌కు పంపారు. కాగా, ఆ కేసుపై గద్వాల కోర్టులో వాదనలు జరిగాయి. జిల్లా పోలీసు అధికారులు సాక్షులను పకడ్బందీగా బ్రీఫింగ్‌ చేసి వారిని కోర్టులో నిజం చెప్పేలా చేశారు. బాలిపై జరిగిన ఘటనపై స్పెషల్‌ సెషన్స్‌ జడ్జి కం పోక్సో కోర్టు జడ్జి శ్రీనివాస్‌ నిందితుడు నడిపి తిమ్మప్పకు పదేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.10వేల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.

నీటి సంపులో పడి బాలుడి మృతి

కల్వకుర్తి రూరల్‌: మండలంలోని తాండ్రలో ఇంటిముందున్న నీటి సంపులో పడి బాలుడు మృతిచెందిన ఘటన విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన శివ, స్వాతి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండురోజుల క్రితం ఓటు హక్కు నమోదు చేసుకోవడంతోపాటు, పిల్లలకు ఆధార్‌కార్డు తీసుకోవడానికి తమ సొంతూరుకు వచ్చారు. మంగళవారం తమ కుమారుడు విక్క(3)కి స్నానం చేయించిన అనంతరం తల్లి ఇంట్లో పనులు చేసుకుంటోంది. బాలుడు ఆడుకుంటూ వెళ్లి సంపులో పడి మృతిచెందాడు.

వివాహిత ఆత్మహత్య

మల్దకల్‌ : కుటుంబ కలహాలతో నిప్పంటించుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ఉలిగేపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఆంజనేయులు, భార్య సుజాత (30) పొలంలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకు నేవారు. సుజాతకు ముగ్గురు పిల్లలు పుట్టి చనిపోవడంతో ఆ వి షయంపై ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో సోమ వారం రాత్రి ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్థాపం చెందిన సుజాత నిప్పంటించుకుంది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందినట్లు ఏఎస్‌ఐ ఈశ్వరయ్య తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

చికిత్స పొందుతూ

వైద్య విద్యార్థిని మృతి

వైద్యుల నిర్లక్ష్యమే కారణమని

కుటుంబ సభ్యుల ఆరోపణ

పాలమూరు: సర్జరీ తర్వా త దాదాపు మూడు రోజు ల పాటు ఆస్పత్రిలోని వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ యువ వైద్య విద్యార్థిని మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కోదాడకు చెందిన ధరావత్‌ అమృత(23) జిల్లాకేంద్రంలోని ఎస్‌వీఎస్‌ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి హౌజ్‌సర్జన్‌(ఇంటన్‌షిప్‌)గా పనిచేస్తోంది. అయితే కొన్ని రోజులుగా ఆమె థైరాయిడ్‌ సమస్యతో ఇబ్బంది పడుతోంది. దీంతో ఆమెను ఈనెల 4న ఎస్‌వీఎస్‌ ఆస్పత్రిలో థైరాయిడ్‌కు సంబంధించిన సర్జరీ పూర్తి చేశారు. సర్జరీ అయిన తర్వాత మూడు రోజుల పాటు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న విద్యార్థిని మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని రూరల్‌ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement