పేలిన కుక్కర్‌: చిన్నారులకు గాయాలు | - | Sakshi
Sakshi News home page

పేలిన కుక్కర్‌: చిన్నారులకు గాయాలు

Jul 7 2026 1:19 AM | Updated on Jul 7 2026 1:19 AM

కొల్లాపూర్‌: పట్టణంలోని వరిదేల యూపీఎస్‌ పాఠశాల ఆవరణలో సోమవారం అంగన్‌వాడీ కేంద్రంలో ప్రమాదవశాత్తు వంట కుక్కర్‌ పేలి చిన్నారులు గాయపడ్డారు. ఆయాగా పనిచేస్తున్న బాలమ్మ స్థానంలో ఆమె కూతురు చెన్నమ్మ కొంతకాలంగా విధులు నిర్వహిస్తోంది. ఎప్పటిలాగే చెన్నమ్మ వంట చేస్తుండగా కుక్కర్‌ మూత తీసే సమయంలో ఒక్కసారిగా ఎగిరిపడింది. దీంతో కుక్కర్‌లోని వేడినీళ్లు చిన్నారులు గణేష్‌, భాను, అక్షయ పడి గాయపడ్డారు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయించారు. గాయపడ్డ చిన్నారులను ఐసీడీఎస్‌ సీడీపీఓ మహేశ్వరి, కౌన్సిలర్‌ బోరెల్లి మహేష్‌లు పరామర్శించారు.

మటన్‌ ముక్క ఇరుక్కొని కళాకారుడు మృతి

పాన్‌గల్‌: గొంతులో మటన్‌ ముక్క ఇరుక్కొని కళాకారుడు మృతిచెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బంధువులు, గ్రా మస్తుల కథనం ప్రకారం.. మండలంలోని జమ్మాపూర్‌కు చెందిన ఎర్రం ఎల్లయ్య(65) ఆదివా రం గ్రామంలో ఓ వివాహానికి వెళ్లి భోజనం చేస్తుండగా.. గొంతులో మటన్‌ ముక్క ఇరుక్కొని శ్వాస ఆడక కుప్పకూలిపడి చనిపోయాడు. ఎల్లయ్య వీరబ్రహ్మంగారి నాటకంలో ఆదాంబీ పాత్రతో మంచిపేరు తెచ్చుకున్నాడని గ్రామస్తులు పేర్కొన్నారు. ఎల్లయ్య అకాల మరణం బాధాకరమన్నారు. మృతుడి కుటుంబాన్ని ఒకేషనల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రయ్య, మాజీ సర్పంచ్‌ భాస్కర్‌రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపి బాధిత కుటుంబానికి రూ.5వేలు ఆర్థికసాయం అందజేశారు. మృతుడికి భార్య యశోదమ్మ, కుమారుడు, కూతురు ఉన్నారు.

విద్యుదాఘాతంతో

యువకుడి మృతి

ఇటిక్యాల: విద్యుదాఘతంతో యువకుడు మృతిచెందిన ఘటన ఇటిక్యాల పీ ఎస్‌ పరిధిలో చోటు చేసు కుంది. ఎస్‌ఐ రవిరాథోడ్‌ కథనం ప్రకారం.. మండలంలోని షాబా ద్‌కు చెందిన అర్పన్‌(20) సోమవారం తమ వ్యవసా య పంటపోలంలో పత్తిపంటలో ఎద్దుల సహాయంతో పొలం పనులు చేస్తుండగా.. విద్యుత్‌ స్తంభం నుంచి కరెంటు మోటారుకు ఉన్న వైర్లు తగిలి అక్కడికక్కడే కప్పకులిపోయాడు. గమనించిన స్థానికులు గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించంగా.. అక్కడున్న వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు తండ్రి కుసునూర్‌ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. యువకుడి మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు ఆలుముకున్నాయి.

తాళం వేసిన ఇంటికి కన్నం

జడ్చర్ల: ఇంటికి తాళం వేసి సొంత ఊరుకు వెళ్లి వచ్చేలోగా తాళం విరగ్గొట్టి ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. సీఐ కమలాకర్‌ కథనం మేరకు.. మండలంలో ని తుపుడగడ్డతండాకు చెందిన జర్పుల శ్రీధర్‌ స్థానిక వెంకటపతిరావు కాలనీలో నివాసంటున్నాడు. ఇంటికి తాళం వేసి సొంత ఊరుకు వెళ్లిన సంమయంలో ఇంటి తాళాలు విరగ్గొట్టి ఇంట్లో దాచిన 2తులాల బంగారు నల్లపూసల దండ, రూ.40వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement