సీఎస్‌ఆర్‌ సమ్మిట్‌కు యెన్నంకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

సీఎస్‌ఆర్‌ సమ్మిట్‌కు యెన్నంకు ఆహ్వానం

Jul 7 2026 1:19 AM | Updated on Jul 7 2026 1:19 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ‘చేంజ్‌ టూ లెగసీ’ ధీమ్‌తో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సీఎస్‌ఆర్‌ సమ్మిట్‌కు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డిని నిర్వాహకులు సోమవా రం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈనెల 25వ తేదీన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్‌ శాంతి సరోవర్‌లో ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్‌ జరగనుంది. సమాజంలో మార్పును తీసుకువచ్చే ఆలోచనలు, భాగస్వామ్యాలు, వినూత్న కార్యక్రమాలు, సామాజి క ప్రభావాన్ని పెంపొందించే అంశాలపై ఈ సమ్మిట్‌ వేదికగా నిలవనుంది. ఈ సమ్మిట్‌లో విద్య అనే అంశంపై యెన్నం ముఖ్య వక్తగా ప్రసంగించనున్నారు.సమ్మిట్‌కు దేశంలోని వివిఽ ద రంగాలకు చెందిన 300 మందికిపై కార్పొరేట్‌ ప్రతినిధులు, 1200కు పైగా స్వచ్చ సంస్థల ప్రతినిధులు, సీఎస్‌ఆర్‌ నిపుణులు, విద్యావేత్త లు, ప్రభుత్వ ప్రముఖులు హాజరుకానున్నారు.

నాన్‌టీచింగ్‌ సిబ్బంది అభ్యన్నతికి కృషి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూలో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ సిబ్బంది అభ్యున్నతికి కృషిచేస్తానని వీసీ శ్రీనివాస్‌ అన్నారు. ఇటీవల వేతనాలు పెంచిన నేపథ్యంలో సోమవారం అడ్మిన్‌ మీటింగ్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు వీసీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీయూ అభివృద్ధిలో నాన్‌టీచింగ్‌ సిబ్బంది ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారని, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జీతాల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొన్నారు. జీతాల పెంపును బాధ్యతగా భావించి నిర్వహించామని, అలాగే ప్రతి ఉద్యోగి కూడా ఉద్యోగాన్ని బాధ్యతగా తీసుకొని సమయపాలన పాటిస్తూ.. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు మాట్లాడుతూ పీయూలో భాగమైన సిబ్బంది సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటామని, సిబ్బంది కూడా యూనివర్సిటీ అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేయాలని కోరారు. అనంతరం వీసీ, రిజిస్ట్రార్‌తో పాటు కంట్రోలర్‌ ప్రవీణ, ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి తదితరులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌, బోధనేతర సిబ్బంది రామ్మోహన్‌, బుర్రన్న, సత్యం, శేఖర్‌, సూర్య, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement