
అడవిలో తప్ప బయట బతకలేం
మేం ఏళ్లుగా మా తాత ముత్తాతల నుంచి అడవిలో ఉంటున్నాం. అడవిలో ఉన్న ఆధారం మాకు బయట దొరకదు. ఇక్కడ దొరికింది తిని బతుకుతున్నాం. బయటకు పోయినంక మాకు దిక్కు ఎవరు ఉంటరు. గ్రామాలు అన్నీ వెళుతున్నాయని అంటున్నరు. మేం అడవిలోనే ఉంటాం.
– దంసాని లింగయ్య,
కొల్లంపెంట, అమ్రాబాద్ మండలం
పునరావాసం ఇచ్చాకే పోతాం..
మేం ఏళ్లుగా అడవినే నమ్ముకుని బతుకుతున్నాం. మాకు వేరే పని తెలువదు. పులులు, వన్యప్రాణుల కోసం మమ్మల్ని బయటకు పొమ్మని అంటున్నారు. మాకు చెప్పినట్టుగా పూర్తిగా పరిహారం, ఇల్లు, భూమి ఇచ్చాకనే ఇక్కడి నుంచి పోతాం.
– గోరటి చంద్రమ్మ, కుడిచింతల్‌బైల్
మానవీయ కోణంలో
చేపడతాం..
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో రెండు దశల్లో గ్రామాల రీలొకేషన్ ప్రక్రియ ఉంటుంది. నిర్వాసితులకు ఎన్టీసీఏ ద్వారా పూర్తిస్థాయిలో పరిహారం అందించాకే రీలొకేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. రీలొకేషన్ కోసం స్వచ్ఛందంగా ముందుకువచ్చిన వారికే ప్యాకేజీ అందించి తరలింపు చేపడతాం.
– రోహిత్ గోపిడి, ఐఎఫ్‌ఎస్, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్‌కర్నూల్
●

అడవిలో తప్ప బయట బతకలేం

అడవిలో తప్ప బయట బతకలేం