చాంపియన్లుగా హైదరాబాద్, మేడ్చల్‌ | - | Sakshi
Sakshi News home page

చాంపియన్లుగా హైదరాబాద్, మేడ్చల్‌

Aug 27 2024 1:16 AM | Updated on Aug 27 2024 8:24 PM

-

హోరాహోరీగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లు 

రన్నరప్‌గా నిలిచిన వికారాబాద్‌ జట్లు 

ముగిసిన రాష్ట్రస్థాయి అండర్‌–16 బాస్కెట్‌బాల్‌ టోర్నీ

 

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో సోమవారం రాష్ట్రస్థాయి అండర్‌–16 (యూత్‌) బాస్కెట్‌బాల్‌ టోర్నీలో చాంపియన్లుగా బాలుర విభాగంలో హైదరాబాద్‌ జట్టు, బాలికల విభాగంలో మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జట్లు నిలిచాయి. బాల, బాలికల విభాగాల్లో వికారాబాద్‌ జట్లు రన్నరప్‌ స్థానాలను దక్కించుకోగా, మూడోస్థానంలో మేడ్చల్‌ మల్కాజ్‌గిరి బాలుర విభాగం, బాలికల్లో రంగారెడ్డి జట్లు నిలిచాయి.  

చివరి వరకు ఉత్కంఠ 
బాలుర, బాలికల విభాగం ఫైనల్‌ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. ఆయా జట్లు నువ్వానేనా అనే రీతిలో తలపడ్డాయి. ఉత్కంఠంగా చివరి వరకు సాగిన   బాలుర విభాగం ఫైనల్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు 57–53 పాయింట్ల తేడాతో వికారాబాద్‌ జట్టుపై విజయం సాధించింది. 

బాలికల ఫైనల్‌ మ్యాచ్‌లో
అదేవిధంగా బాలికల ఫైనల్‌ మ్యాచ్‌లో మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జట్టు 58–56 పాయింట్ల తేడాతో వికారాబాద్‌ జట్టుపై గెలుపొందింది. బాలుర విభాగం మూడోస్థానం మ్యాచ్‌లో మేడ్చల్‌ జట్టు 50–40 పాయింట్ల తేడాతో రంగారెడ్డి జట్టుపై, బాలికల మూడోస్థానం మ్యాచ్‌లో రంగారెడ్డి జట్టు 35–7 పాయింట్ల తేడాతో హైదరాబాద్‌ జట్లపై విజయాలు నమోదు చేసుకున్నాయి.   

ట్రోఫీలు అందజేసిన మున్సిపల్‌ చైర్మన్‌, డీఎస్పీ 
టోర్నీలో విన్నర్‌, రన్నరప్‌, మూడోస్థానం జట్లకు మున్సిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీనియర్‌ న్యాయవాది మనోహర్‌రెడ్డి ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం డీఎప్పీ మాట్లాడుతూ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఇలాంటి టోర్నీలు ఎంతగానో దోహదపడుతాయని తెలిపారు. ఇలాంటి టోర్నీలు మరిన్ని నిర్వహించాలని కోరారు. 

కార్యక్రమంలో సీఐ అప్పయ్య, రాష్ట్ర బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి నార్మన్‌ ఐజాక్‌, జిల్లా అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్‌బిన్‌ అహ్మద్‌ జాకీర్‌, నసరుల్లా హైదర్‌, జిల్లా వాలీబాల్‌ సంఘం ప్రతినిధి చెన్న వీరయ్య, కౌన్సిలర్లు రామ్‌, సాదతుల్లా హుస్సేనితోపాటు మీర్‌ అర్షద్‌అలీ, ఇలియాజ్‌, ఖాలెద్‌అలీ, ఖలీల్‌, సుబాన్‌జీ, ముకర్రం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement