యోగా పోటీల్లో లక్ష్మీప్రహర్షకు కాంస్యం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి సీఎం కప్ యోగాసన పోటీల్లో పాలమూరు జిల్లా క్రీడాకారిణి అర్వ లక్ష్మీప్రహర్ష మెరుగైన ప్రతిభ కనబర్చింది. ఈ పోటీల్లో ఈమె మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకం కైవసం చేసుకుంది.
ఉరేసుకొని యువకుడి మృతి
వీపనగండ్ల: మండలంలోని కల్వరాల్ల గ్రామానికి చెందిన బోరెల్లి రమేష్ (32) మృతిచెందిన ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాణి తెలిపిన వివరాల ప్రకారం భార్యభర్తల గొడవ కారణంగా ఆరేళ్లుగా భార్యతో రమేస్ దూరంగా ఉంటున్నాడు. దీంతో మనస్తాపానికి గురై శనివారం అర్ధరాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని తండ్రి బోరెల్లి నాగశేషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.
యోగా పోటీల్లో లక్ష్మీప్రహర్షకు కాంస్యం


