‘42 శాతం రిజర్వేషన్‌ను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలి’
మెట్టుగడ్డ: బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలుకు రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదో షెడ్యూల్లో ప్రవేశపెట్టాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవులు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ పాఠశాల కాలోజీ హాల్‌లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో బీసీలకు జనాభా దామాషకు తగినట్లు నిధులు కేటాయించాలని కోరారు. 9వ షెడ్యుల్‌లో చేర్చేందుకు కేంద్రంపైన రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన పార్టీలు ఒత్తిడి తీసుకురావాలని కోరారు. వచ్చే బడ్జెట్లో కార్పొరేషన్లకు నిధులు కేటాయించడమే కాకుండా నిధులు విడుదల చేసి సక్రమంగా ఖర్చు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీలు ఐక్యంగా పోరాటం చేసి 42శాతం రిజర్వేష్లను సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఉమ్మడి జిల్లా చీఫ్ కో–ఆర్డినేటర్‌గా రమేశ్‌గౌడ్
జిల్లా కేంద్రంలో జరిగిన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నూతన కమిటీని ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవులు ప్రకటించారు. ఉమ్మడి జిల్లా చీఫ్ కో–ఆర్డినేటర్‌గా రమేశ్‌గౌడ్‌ను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. కో–ఆర్డినేటర్లుగా భాస్కరయ్య, భూమయ్య, నారాయణ, భీంపల్లి శ్రీకాంత్, బోల యాదయ్య, రామరాజు, సరోజ, తాయప్పను నియమించారు. నాగర్‌కర్నూల్ బాధ్యులుగా సత్యం, సదానందం, గద్వాల బాధ్యులుగా ప్రకాశ్‌చారికి నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్ర సలహాదారులుగా బెక్కెం జనార్దన్, లక్ష్మణ్‌గౌడ్, వెంకటనర్సయ్య యాదవ్, రామకృష్ణను నియమించారు.


