హోరాహోరీగా సీఎం కప్‌ క్రీడలు | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా సీఎం కప్‌ క్రీడలు

Feb 23 2026 9:06 AM | Updated on Feb 23 2026 9:06 AM

హోరాహ

హోరాహోరీగా సీఎం కప్‌ క్రీడలు

నెట్‌బాల్‌ బాలుర ఫైనల్‌లోమహబూబ్‌నగర్‌, నారాయణపేట

బాలికల్లో మహబూబ్‌నగర్‌, ఖమ్మం జట్లు

నేడు ముగియనున్న క్రీడాపోటీలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో జరుగుతున్న సీఎం కప్‌ రెండో ఎడిషన్‌ రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. నెట్‌బాల్‌ బాలుర విభాగం ఫైనల్‌కు మహబూబ్‌నగర్‌, నారాయణపేట జట్లు, బాలికల విభాగం ఫైనల్‌కు మహబూబ్‌నగర్‌, మేడ్చల్‌ జట్లు చేరాయి. రాష్ట్రస్థాయి సీఎం కప్‌ నెట్‌బాల్‌ పోటీలు నేడు (సోమవారం) ముగియనున్నాయి.

సెమీఫైనల్‌ మ్యాచ్‌లు

ఆదివారం జరిగిన బాలుర విభాగం మొదటి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు 31–9 పాయింట్ల తేడాతో కామారెడ్డి జట్టుపై గెలుపొందింది. రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో నారాయణపేట జట్టు 28–12 పాయింట్ల తేడాతో నల్గొండపై విజయం సాధించింది. బాలికల విభాగం మొదటి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు 16–13 పాయింట్ల తేడాతో నిజామాబాద్‌పై, రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో మేడ్చల్‌ జట్టు 20–17 తేడాతో ఖమ్మం జట్లపై గెలుపొందాయి.

క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లు

అంతకుముందు బాలుర విభాగం క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచుల్లో మహబూబ్‌నగర్‌ జట్టు 19–14 పాయింట్ల తేడాతో కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జట్టుపై, నారాయణపేట జట్టు 30–10 తేడాతో కరీంనగర్‌పై, కామారెడ్డి జట్టు 16–8 తేడాతో నిజామాబాద్‌పై, నల్గొండ జట్టు 17–15 తేడాతో ఖమ్మంపై విజయాలు నమోదు చేసుకున్నాయి. బాలికల విభాగం క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచుల్లో మహబూబ్‌నగర్‌ జట్టు 17–6 పాయింట్ల తేడాతో జనగాంపై, ఖమ్మం జట్టు 25–6 తేడాతో నల్గొండపై, నిజామాబాద్‌ జట్టు 22–6 తేడాతో కామారెడ్డి జట్టుపై, మేడ్చల్‌ జట్టు 16–12 తేడాతో కరీంనగర్‌పై గెలుపొందాయి. ఆది వారం నెట్‌బాల్‌ మ్యాచ్‌లను జిల్లా యువజన, క్రీడ ల అధికారి ఎస్‌.శ్రీనివాస్‌ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణస్థాయి నుంచి క్రీడలను ప్రో త్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

హోరాహోరీగా సీఎం కప్‌ క్రీడలు 1
1/3

హోరాహోరీగా సీఎం కప్‌ క్రీడలు

హోరాహోరీగా సీఎం కప్‌ క్రీడలు 2
2/3

హోరాహోరీగా సీఎం కప్‌ క్రీడలు

హోరాహోరీగా సీఎం కప్‌ క్రీడలు 3
3/3

హోరాహోరీగా సీఎం కప్‌ క్రీడలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement