సాంకేతికతో లాభాలు బాగు | - | Sakshi
Sakshi News home page

సాంకేతికతో లాభాలు బాగు

Feb 23 2026 9:06 AM | Updated on Feb 23 2026 9:06 AM

సాంకే

సాంకేతికతో లాభాలు బాగు

అలంపూర్‌: వాతవరణంలో మార్పులు, తగ్గుతున్న భూసారం.. భూగర్భ జలాలు, కూలీల కొరత, పెట్టుబడుల పెరుగుదల వంటి సమస్యలతో పంట సాగులో రైతన్నలకు కష్టాలు తప్పడం లేదు. ఆధునిక, శాసీ్త్రయ సేంద్రియ పద్ధతులు పాటించి సాగుకు సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తే సాగు లాభసాటిగా మారుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియనాయక్‌ రైతులకు సూచించారు.

వ్యవసాయ యాంత్రీకరణ : ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ పనులకు కూలీల కొరత తీవ్రంగా ఉంది. వీటిని అధిగమించడానికి ఎరువులు, విత్తనాలు వేసే సీడ్‌ డ్రిల్‌ వంటి పరికరాలు, వరినాటు యంత్రాలు, దుక్కి చేసే రోటోవేటర్స్‌, పురుగు మందు పిచికారీ కోసం ట్రాక్టర్‌ స్ప్రేయర్లు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వీటి వినియోగంతో రైతులు సాగు వ్యయాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది.

మిశ్రమ పద్ధతులకు ప్రాధాన్యం: రైతులు సాధారణ పంటలతో పాటు ఉద్యానవన పంటలు, పాడి పశువులు, గొర్రెలు, మేకల పెంపకం చేపట్టాలి. దీని వలన ఒక విధంగా కలిసిరాకున్న మరోక రంగంలో కలిసి వస్తుంది.

అంతర్‌పంటలకు పెద్దపీట

ఒకే రకమైన పంటను కాకుండా అంతర్‌ పంటలను సాగు చేసుకోవాలి. దీర్ఘకాలిక పంటల్లో స్వల్ప కాలిక పంటలను అంతర్‌ పంటలను సాగు చేయాలి. దీంతో భూసారం పెరగడమేకాక రైతులకు ఖచ్చితమైన ఆధాయం వచ్చే అవకాశం ఉంటుంది.

నాణ్యమైన విత్తనాలు: విత్తనాల కోసం ఊరు, పేరు లేని విత్తనాలపై ఆధారపడకూడదు. నాణ్యమైన విత్తనాలను సేకరించుకొని రైతులే విత్తనాలను తయారు చేసుకోవాలి. దీంతో మీతో పాటు తోటి రైతులకు సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది.

తక్కువ నీటితో ఎక్కువ సాగు : సాగునీటిని ఆదా చేసే డ్రిల్‌, తుంపర సేద్యం పరికరాలను వాడాలి. దీంతో తక్కవ నీటితో ఎక్కువ ఎకరాల్లో పొలం సాగు చేసుకోవచ్చు.

మార్కెట్‌ ధరలపై అవగాహన : రైతులు మార్కెట్‌ ధరలపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలి. దినపత్రికల్లో వచ్చే మార్కెట్‌ ధరలను పరిశీలించి రైతులు అమ్మకాల్లో తగు చర్యలు తీసుకోవాలి.

వాతవరణంపై సమాచారం: వ్యవసాయ పరిశోధన స్థానాలు ఉన్నచోట వారానికి రెండు మూడు రోజులు ముందస్తు వాతవరణ సలహాలను అందిస్తున్నారు. వీటి ఆధారంగా వ్యవసాయ పనులు చేపట్టాలి.

పాడి–పంట

వ్యవసాయ వార్తలపై దృష్టి

దినపత్రికలు, మీడియాలో వచ్చే వ్యవసాయ వార్తలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. దీని వలన వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలు, సూచనలు లభిస్తాయి. వ్యయంలో ఎదుర్కొంటున్న సమస్యలకు కాల్‌ సెంటర్‌ను సంప్రదించవచ్చు. వ్యవసాయ శిక్షణ తరగతులు, మేళాలు, ప్రదర్శనలు ఎక్కడ జరిగిన వెళ్లి అవగాహన పెంచుకోవాలి. ఇతర రైతులతో ఎప్పటికిప్పుడు నూతన వ్యవసాయ పద్ధతులపై చర్చించి వారి నుంచి విలువైన సమాచారం పొందాలి.

సాంకేతికతో లాభాలు బాగు 1
1/2

సాంకేతికతో లాభాలు బాగు

సాంకేతికతో లాభాలు బాగు 2
2/2

సాంకేతికతో లాభాలు బాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement