ఉదయం రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా.. యువకుడి విషాదం! | - | Sakshi
Sakshi News home page

ఉదయం రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా.. యువకుడి విషాదం!

Feb 9 2024 12:56 AM | Updated on Feb 9 2024 9:09 PM

- - Sakshi

శంకర్‌ (ఫైల్‌)

మహబూబ్‌నగర్‌: మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తండా శివారులోని హైదరాబాద్‌ రోడ్డుపై కారు ఢీకొని శంకర్‌(శివ)(18) గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట మండలం, అప్పక్‌పల్లికి చెందిన శ్రీనివాసులు, అంజిలమ్మ కుమారుడు శంకర్‌ హైదరాబాద్‌ రోడ్డు వెంట ఉదయం రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండేవాడు.

వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో శంకర్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. కారు నిలుపకుండా పారిపోయాడు. వెంటనే స్థానికులు గమనించి పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. యువకుడు నారాయణపేటలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ గోకరి తెలియజేశారు.

ఇవి చదవండి: అనుమానాస్పదస్థితిలో బీటెక్‌ విద్యార్థి విషాదం!

Advertisement
 
Advertisement
Advertisement