అనుమానాస్పదస్థితిలో బీటెక్‌ విద్యార్థి విషాదం! | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో బీటెక్‌ విద్యార్థి విషాదం!

Feb 9 2024 12:56 AM | Updated on Feb 9 2024 9:00 PM

- - Sakshi

మహ్మద్‌ (ఫైల్‌)

మహబూబ్‌నగర్‌: అనుమానాస్పద స్థితిలో బీటెక్‌ విద్యార్థి ఉరేసుకుని మృతిచెందిన ఘటన హైదరాబాద్‌లోని మేడ్చల్‌ మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని అయ్యవారిపల్లికి చెందిన బాలెమియా, భార్య నస్రీన్‌ బేగానికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

తాను ఆటో నడుపుతూ, భార్య కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి పెద్దకుమారుడు రఫీ అపోలో ఫార్మసిలో పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు ఎండీ మహ్మద్‌(21) హైదరాబాద్‌లోని మేడ్చల్‌, మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతూ.. అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు.

ఇతను బుధవారం రాత్రి అనుమానాస్పదంగా కాలేజీ హాస్టల్‌లో ఉరేసుకుని మృతిచెందాడు. ఆ వివరాలను రాత్రి 2 గంటలకు పోలీసులు అయ్యవారిపల్లిలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. గురువారం గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం మృతదేహాన్ని అయ్యవారిపల్లికి తీసుకొచ్చారు.

ఇవి చదవండి: హనీట్రాప్‌ చేసి.. కత్తులతో పొడిచి

Advertisement
 
Advertisement
Advertisement