కురుమూర్తిరాయ నుంచి నీటి విడుదల | - | Sakshi
Sakshi News home page

కురుమూర్తిరాయ నుంచి నీటి విడుదల

Aug 10 2026 1:22 AM | Updated on Aug 10 2026 1:22 AM

మదనాపురం: మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కురుమూర్తిరాయ ఎత్తిపోతల పథకం మో టార్లను ఆన్‌ చేసి కాల్వలకు ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి ఆదివారం నీటిని విడుదల చేశారు. అనంతరం గ్రామంలో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరద నీటి లభ్యతను బట్టి ఇప్పటికే కోయిల్‌సాగర్‌, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ఫేజ్‌–1, 2 ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేశామన్నారు. సాంకేతిక అధికారుల సూచనలు, రైతుల అవసరాల ఆధారంగా నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో లిఫ్టు చైర్మన్‌ రాజవర్ధన్‌రెడ్డి, సర్పంచు రాజేష్‌యాదవ్‌, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

72.013 మి.యూ

విద్యుదుత్పత్తి

ఆత్మకూర్‌: జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుందని ఎస్‌ఈ శ్రీధర్‌ తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 4 యూనిట్ల ద్వారా 160 మెగావాట్లు కలిపి 72.013 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి విజయవంతంగా చేపట్టామన్నారు. దిగువ జూరాలలోని ఒక యూనిట్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందని త్వరలోనే సమస్యను పరిష్కరించి పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేపడుతామని వెల్లడించారు.

.............

09కేకేటీ101

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement