గంజాయి మత్తులో యువత | - | Sakshi
Sakshi News home page

గంజాయి మత్తులో యువత

Aug 10 2026 1:22 AM | Updated on Aug 10 2026 1:22 AM

మరికొన్ని ఘటనలు..

ఇప్పటికే ప్రధాన సూత్రదారి అరెస్టు

తెలుగు రాష్ట్రాల్లో

కూపీలాగుతున్న పోలీసులు

తాజాగా 1.30 కిలోల గంజాయి సీజ్‌

గద్వాల క్రైం: నడిగడ్డలో యువత మత్తుకు బానిసవుతున్నారు. కూలీలు, విద్యార్థులు, వ్యాయామశాలలో కసరత్తు చేస్తున్న వారు నిషేధిత మత్తు పదార్థాల కోసం పరుగులు తీస్తున్నారు. జిల్లాలో ఇద్దరు సొంత అన్నదమ్ములే గుట్టుగా గంజాయి దందాను కొన్ని నెలలుగా సాగిస్తున్న వ్యవహారం గుట్టురట్టయింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్‌ నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నారు. గుట్టుచప్పుడుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు.

సుల్తానాపురంలో..

అలంపూర్‌ నియోజకవర్గంలోని సుల్తానాపురం గ్రా మానికి చెందిన అన్నదమ్ములు గంజాయి విక్రయాలు చేస్తున్నారని నిర్ధారించారు. ఈ నెల 8న వా రి వద్ద 1.30 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ప్రధాన సూత్రదారిని అరెస్టు చేయడం జోగుళాంబ గద్వాల జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. సుల్తా నాపురం గ్రామానికి చెందిన చంద్రకాంత్‌గౌడ్‌, రవిచందర్‌గౌడ్‌ కొన్ని నెలలుగా గంజాయి (మత్తు పదార్థాని)కి అలవాటు పడ్డారు. అయితే తెలిసిన స్నేహితులకు సైతం గంజాయిని అలవాటు చేశా రు. మూడు నెలలుగా సాగుతున్న మత్తు దందాను అలంపూర్‌ పోలీసులు ఎట్టకేలకు గుర్తించి గుట్టురట్టు చేశారు. గంజాయి కిలో రూ.30 వేల నుంచి రూ.40 వేలకు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్‌లో రూ.లక్ష వరకు విక్రయిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నంద్యాల జిల్లా నందికొట్కూర్‌లో జిల్లా పోలీసులు పలు అనుమానిత వ్యక్తుల ఇళ్లలో సోదాలు సైతం నిర్వహించారు.

మూడు నెలలుగా....

సుల్తానాపురానికి చెందిన ఇద్దరు సోదరుల్లో ఒకరు కొన్ని ఏళ్ల క్రితమే గంజాయికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో ప్రధాన సూత్రదారి(సోదరుడు) కర్నూలు జిల్లాలోని ఫిజియోథెరపీ చదువు పూర్తిచేసి శిక్షణ కోసం హైదరాబాద్‌లోని ఓ క్లినిక్‌లో ఆరు నెలలు శిక్షణ పొందాడు. ఈ క్రమంలో ప్రతిరోజు దగ్గర్లోని వ్యాయామశాలకు వెళ్తున్న క్రమంలో గంజాయి తీసుకునే వ్యక్తులు పరిచయంతో తన సోదరుడితో మంతనాలు చేసి గంజాయి విక్రయాలు చేయడం ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు ఉండవని గ్రహించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్‌ నగరాల నుంచి గంజాయి సరఫరా చేసే ముఠా సభ్యుల నుంచి కొనుగోలు చేయడం, ఆ గంజాయిను చిన్నచిన్న పాకెట్లలో అమర్చి అమ్మకాలు చేపట్టారు. పక్కా సమాచారంతో జిల్లా పోలీసులు దాడి చేసి గంజాయి ఆకులు, పూలు, రెమ్మలు, గంజాయి పొడిని స్వాధీనం చేసుకున్నారు.

కూిపీలాగుతున్న పోలీసులు...

గంజాయి విక్రయాలు చేస్తూ పట్టుబడిన నిందితుడి సమాచారం మేరకు జిల్లాలో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని నందికొట్కూర్‌, కర్నూలు, నంద్యాల, ఆత్మకూర్‌, ఆదోని, ఎమ్మిగనూర్‌, డోన్‌, కోడుమూరు తదితర ప్రాంతాల్లోను దర్యాప్తు చేస్తున్నారు. గంజాయికి అలవాటు పడిన వారి సంఖ్య 200లకు పైగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

సుల్తానాపురం సోదరులే గంజాయి విక్రేతలు

1.8.2026న గద్వాల పట్టణంలో కొందరు యువత నిషేధిత మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారన్న సమాచారం మేరకు పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకొని రక్త పరీక్షలు నిర్వహించారు. గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది.

28.7.2026న గద్వాలకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో గంజాయి కొనుగోలు చేశాడు. అక్కడే రెండు రోజలు ఉండి గద్వాలకు వచ్చాడు. సమాచారం మేరకు పోలీసులు వ్యవసాయ మార్కెట్‌ యార్డు సమీపంలో అదుపులోకి తీసుకొని పరీక్షలు చేయించారు. గంజాయి తీసుకున్నట్లు తేలింది. గతేడాదిలో నాలుగు ఎన్‌డీపీఎస్‌ కేసులు నమోదయ్యాయి. 5.33 కేజీల గంజాయితో పాటు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement