మిడ్జిల్: విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న యు వకుడు మార్గ మధ్యలో మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికు లు, గ్రామస్తుల కథనం మే రకు.. మండల పరిధిలోని బోయిన్‌పల్లికి చెందిన గుడిగాన్‌పల్లి బన్ని (22) శనివారం రా త్రి జడ్చర్ల సమీపంలోని హెటిరో కంపెనీలో నైట్ డ్యూటీ ముగించుకొని ఆదివారం ఉద యం ఇంటికి బైక్‌పై వస్తుండగా మార్గ మధ్య లో 167 జాతీయ రహదారిపై మున్ననూర్ సమీపంలో బైక్ ముందు వెళ్తున్న ఎద్దుల బండిని ఢీకొట్టడంతో బన్ని అక్కడికక్క డే మృతి చెందాడు. యాదమ్మ, బంగారమ్మకు ముగ్గు రు పిల్లలు ఉండగా రెండో సంతానం బన్ని. మృతుడి తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించిన్నట్లు ఎస్‌ఐ శ్రీనువాసులు తెలిపారు.
వాహనం ఢీకొని
గొర్రెల కాపరి మృతి
భూత్పూర్: పట్టణంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా.. పట్టణానికి చెందిన గొల్ల పెద్ద బుచ్చన్న (65) మృతి చెందిన ఘట న చోటు చేసుకుంది. ఎస్‌ఐ నాగన్న తెలిపిన సమాచారం మేరకు గొల్ల పెద్ద బుచ్చన్న పట్టణ శివారులో ఓ వ్యవసాయ పొలంలో గొర్రెల మంద నిలిపారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆయన ఇంటి నడుచుకుంటూ వస్తుండగా టాటా మోటార్స్ షోరోం ఎదురుగా హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. పట్టణానికి బజారు ఆంజనేయులు తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్తుండగా గొల్ల పెద్ద బుచ్చన్న మృతదేహాం కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలాన్ని భూత్పూర్ పోలీసులు పరిశీలించారు. మృతుడి కుమారుడు గోపన్‌పల్లి ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగన్న తెలిపారు.
ఎక్లాస్‌పూర్‌లో విషాదం
అయిజ: మండలంలోని ఎక్లాస్‌పూర్‌కి చెందిన వైద్య విద్యార్థిని కనికె ప్రియాంక(28) ఆదివారం మృతిచెందడంతో స్వగ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన వెంకటేష్, చంద్రకళ దంపతులకు ముగ్గురు కూతుళ్లు కాగా.. ప్రియాంక మెదటి సంతానం. వీరు గత నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. చురుకై న విద్యార్థి మృతితో బంధువులు బోరున విలపించారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం ప్రియాంక మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి ఇక్కడే అంత్యక్రియలు జరిపిస్తారని బంధువులు తెలిపారు.
కృష్ణానదిలో
మృతదేహం లభ్యం
ధరూరు: మండలంలోని గార్లపాడు సమీప కృష్ణానదిలో ఆదివారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం(35–45ఏళ్లు) గమనించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నందీకర్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో సుమారు వారం రోజుల క్రితం నీటిలో పడి మృతిచెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు, ఆచూకీ తెలిసినవారు ధరూర్ పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ తెలిపారు.
బీచుపల్లి పుష్కర్‌ఘాట్‌లో మొసలికి పూజలు
ఎర్రవల్లి: మొసలికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన సంఘటన బీచుపల్లిలో చోటు చేసుకుంది. ఆదివారం మొసలి పిల్ల బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద వరద నుంచి బయటికి వచ్చి అపరకర్మల భవనం సమీపానికి చేరుకుంది. ఈ క్రమంలో బీచుపల్లి పుష్కరఘాట్ క్షేత్ర పురోహితుడు అనిల్‌శర్మ అరగంట పాటు మొసలికి పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలనే ఉద్దేశంతో పూజలు చేసినట్లు పురోహితులు పేర్కొన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఫారెస్ట్ అధికారులతో కలిసి మొసలిని కృష్ణానదిలో వదిలారు.


