కొల్లాపూర్ రూరల్: మండలం సోమశిలలోని కృష్ణానది బ్యాక్ వాటర్‌లో పర్యాటకులకు బోటింగ్ సేవలు పునః ప్రారంభించినట్లు పర్యాటక శాఖ అధికారి నరసింహ్మ తెలిపారు. ఆదివారం కృష్ణానది బ్యాక్ వాటర్‌లో పర్యాటక బోట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూరాల గేట్లు మూసివేయడంతో నదిలో పర్యాటకులకు బోటింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. వేసవిలో నదిలో నీటి లభ్యత తక్కువగా ఉండటం వల్ల బోటింగ్ సేవలు నిలిపివేశామని, నదికి పెద్దఎత్తున వరద రావడంతో తిరిగి ప్రారంభించామన్నారు. పర్యాటకులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించి ప్రయాణించాలని సూచించారు. కార్యక్రమంలో టూరిస్టు పోలీస్ శివ, బోటింగ్ యూనిట్ ఇన్‌చార్జి ప్రేమ్‌కుమార్, సింపుల్ వాటర్ స్సోర్ట్స్ యూనిట్ ఇన్‌చార్జి రాము తదితరులు పాల్గొన్నారు.


