పట్టాల పండుగకు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

పట్టాల పండుగకు వేళాయె..

Nov 28 2026 12:56 AM | Updated on Nov 28 2026 12:56 AM

పట్టాల పండుగకు వేళాయె..

శనివారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

కేయూ క్యాంపస్‌: హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో శనివారం 24వ స్నాతకోత్సవం జరగనుంది. యూనివర్సిటీలోని ఆడిటోరియంలో ప్రత్యేక వేదికను ముస్తాబు చేశారు. విశ్వవిద్యాలయం చాన్సలర్‌ శివప్రతాప్‌శుక్లా, ముఖ్యఅతిథిగా సైయెంట్‌ సంస్థ వ్యవస్థాపకులు, పద్మశ్రీ డాక్టర్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. 290మంది అభ్యర్థులకు 408 బంగారు పతకాలు, 88మందికి పీహెచ్‌డీ పట్టాలు అందజేస్తారు. స్నాతకోత్సవ ఏర్పాట్లను వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం పర్యవేక్షించారు.

అభ్యర్థులకు సూచనలు..

బంగారు పతకాలు అందుకోబోయే అభ్యర్థులు ఉదయం 7 నుంచి 9గంటల వరకు కేయూలోని దూరవిద్యాకేంద్రం ద్వారా మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలలోకి ప్రవేశించి బంగారు పతకాలను స్వీకరించాల్సి ఉంటుంది.

● అభ్యర్థులు ఎక్కువమంది ఉన్నందున 14 బ్యాచ్‌లుగా చేశారు. ముందుగానే బంగారు పతకాలు స్వీకరించాక వాటిని తీసుకొని ఉదయం 9.20గంటలలోపు ఆడిటోరియంలోకి ప్రవేశించి తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలి.

● బంగారు పతకాలతోనే బ్యాచ్‌ల వారీగా గవర్నర్‌తో ఫొటో సెషన్‌ కొనసాగుతుంది.

● పీహెచ్‌డీ పట్టాలు అందుకునే అభ్యర్థులు కూడా దూరవిద్యాకేంద్రం ద్వారానే ఆడిటోరియంలోకి ప్రవేశించి కేటాయించిన సీట్లలో కూర్చోవాలి.

● వీరికి మాత్రం గవర్నర్‌ చేతులమీదుగా పీహెచ్‌డీ పట్టాల ప్రదానం ఉంటుంది.

● అభ్యర్థులు, అధికారులు, సిబ్బంది కూడా వైట్‌ డ్రెస్‌ ధరించి రావాల్సింటుంది.

గవర్నర్‌ షెడ్యూల్‌ ఇలా

● ఉదయం 9.30గంటలకు హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టునుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.

● 10.30గంటలకు హనుమకొండలోని ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలోని హెలిపాడ్‌లో దిగుతారు.

● 10.40గంటలకు వరంగల్‌ నిట్‌ వీఐపీ గెస్ట్‌హౌజ్‌కు చేరుకుంటారు.

● 10.55గంటలకు బయలుదేరి 11 గంటలకు కేయూ ఆడిటోరియానికి చేరుకుంటారు.

● స్నాతకోత్సవం కార్యక్రమంలో మధ్యాహ్నం 12.45గంటలవరకు పాల్గొంటారు.

● 12.45నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కేయూ గెస్ట్‌హౌజ్‌లో ఉంటారు. అక్కడే లంచ్‌.

● మధ్యాహ్నం 2గంటలకు బయలుదేరి ఆర్ట్స్‌కాలేజీలోని హెలిపాడ్‌ వద్దకు చేరుకుంటారు.

● 2.10గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు

స్నాతకోత్సవం నిర్వహణకు సంబంధిత అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బందితో వేసిన 12కమిటీలు నిర్వహణ చూసుకుంటాయి. యూనివర్సిటీలో నెలకొన్న వివిధ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా క్యాంపస్‌లో, బయట 250మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పాస్‌లున్నవారికే ఆడిటోరియంలోకి అనుమతిస్తారు.

అతిథులు : రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌శుక్లా,

పద్మశ్రీ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి

పీహెచ్‌డీ అభ్యర్థులు : 88మంది

బంగారు పతకాలు : 290మందికి 408

విభాగాలు : ఆర్ట్స్‌, సోషల్‌ సైన్సెస్‌, కామర్స్‌ అండ్‌

బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌, లా, ఇంజనీరింగ్‌

అండ్‌ టెక్నాలజీ, ఫార్మసీ, సైన్సెస్‌

విద్యాసంవత్సరాలు : 2021 నుంచి 2025 వరకు

నేడు కేయూ 24వ స్నాతకోత్సవం

ముస్తాబైన ఆడిటోరియం వేదిక

250మంది పోలీస్‌లతో పటిష్ట బందోబస్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement