ఎస్పీ అభినందన | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ అభినందన

Nov 28 2026 12:56 AM | Updated on Nov 28 2026 12:56 AM

మహబూబాబాద్‌ రూరల్‌: హైదరాబాద్‌లో ఈ నెల 23నుంచి 26వ తేదీ వరకు జరిగిన తెలంగాణ స్టేట్‌ మూడో పోలీస్‌ డ్యూటీ మీట్‌లో సి ల్వర్‌, బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించి జాతీయస్థాయికి ఎంపికై న ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల ను ఎస్పీ శబరీష్‌ శుక్రవారం శాలువాలతో సత్కరించి అభినందించారు. కాగా, వారు డిసెంబర్‌ 15నుంచి 20వ తేదీ వరకు మహా రాష్ట్రలోని ముంబైలో జరగనున్న 70వ ఆల్‌ ఇండియా పోలీస్‌ డ్యూటీ మీట్‌లో పాల్గొంటారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, ఆర్‌ఐ అడ్మిన్‌ భాస్కర్‌, ఆర్‌ఐ ఎంటీఓ సోములు తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు

డోర్నకల్‌: జిల్లాలో బాల్యవివాహాల నిర్మూల నకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సంక్షేమాధికారి శిరీష తెలిపారు. మండలంలోని అమ్మపాలెం రైతు వేదికలో శుక్రవారం ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ సమావేశంలో బాల్‌ వివాహ్‌ ముక్త్‌ భారత్‌ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో బాల్యవివాహాల నివారణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపా రు. ప్రతీ గ్రామంలో 22మందితో విలేజ్‌ లెవెల్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కమిటీ కన్వీనర్‌గా అంగన్‌వాడీ టీచర్‌ వ్యవహరిస్తూ నెలకోసారి సమావేశాలు ఏర్పాటు చేస్తూ గ్రామ పరిస్థితులను చర్చిస్తారని తెలిపారు. బాల్య వివాహాల సమాచా రాన్ని 1098కు అందించాలని కోరారు. గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు తెరిచి ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీడీపీఓ లక్ష్మి, షేర్‌ ఎన్‌జీఓ కోఆర్డినేటర్‌ కై లాష్‌ సత్యర్థి, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

నియోజకవర్గాల పునర్విభజన రాజకీయ కుట్ర

నెహ్రూసెంటర్‌: మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ బిల్లును చూపుతూ నియోజకవర్గాల పునర్విభజన చేసేందుకు బీజేపీ రాజకీయ కుట్రలు చేస్తోందని, డీలిమిటేషన్‌కు సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్‌ అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వీరభవన్‌లో పార్టీ శాఖ కార్యదర్శుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రధాన మోదీ సాకుగా చూపుతున్నారని విమర్శించారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి, సహాయ కార్యదర్శులు బి.అజయ్‌సారథిరెడ్డి, నల్లు సు ధాకర్‌రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యుడు కట్టెబోయిన శ్రీనివాస్‌, నాయకులు పెరుగు కుమార్‌, రేషపల్లి నవీన్‌, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, వెంకన్న పాల్గొన్నారు.

భూ రీసర్వే పరిశీలన

దంతాలపల్లి: మండలంలోని రామవరం గ్రా మంలో చేపడుతున్న భూ రీసర్వేను తొర్రూరు ఆర్డీఓ గణేశ్‌ శుక్రవారం పరిశీలించారు. రీ సర్వేలో సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సునీల్‌ కుమార్‌, ఆర్‌ఐ రాజు, సర్వేయర్‌ శ్రీనిత్య, జీపీఓ శిరీష తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement