సమయపాలనేది..? | - | Sakshi
Sakshi News home page

సమయపాలనేది..?

Nov 28 2026 12:56 AM | Updated on Nov 28 2026 12:56 AM

● జీజీహెచ్‌లో గంట ముందే

వెళ్లిపోతున్న వైద్యులు

● ఇబ్బందులు పడుతున్న రోగులు

నెహ్రూసెంటర్‌: జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. వాళ్లు వచ్చిందే టైం.. వెళ్లిందే సమయం అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరుతో ఆస్పత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో ఓపీ చీటీలు ఇస్తున్నారు.. అయితే డాక్టర్లు లేకపోవడంతో రోగులు వెనుతిరిగి వెళ్లిపోతున్నారు. డాక్టర్లు లేరా అని సిబ్బందిని ప్రశ్నించగా వార్డుల్లో రోగులను పరీక్షించేందుకు వెళ్లారంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నట్లు రోగులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆస్పత్రికి వచ్చే రోగులకు రక్త పరీక్షలు అవసరమైతే మరుసటి రోజు రావాలని వైద్యులు సూచించడం కొసమెరుపు.

సమయానికి ముందే..

జీజీహెచ్‌గా అప్‌గ్రేడ్‌ కావడంతో ప్రతీరోజు 800మంది ఓపీ పేషెంట్లు, సుమారు 200మంది అడ్మిట్‌ పేషెంట్లు వస్తున్నారు. ఎక్కువ మంది ఆస్పత్రికి వస్తుండడంతో ఓపీ చీటీల కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. దీంతో వైద్యులు సమయానికి కంటే ముందుగానే వెళ్లిపోతుండడంతో రోగులు మరుసటిరోజు రావాల్సి వస్తోంది. ఆస్పత్రి చుట్టూ తిరగలేక కొంతమంది ప్రైవేట్‌ దారి పడుతున్నారు. కొంత మంది వైద్యులు ఉదయం ఆస్పత్రికి వచ్చి డ్యూటీ సమయంలోనే తమ ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్తున్నట్లు సమాచారం.

పర్యవేక్షణ కరువు..

ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించకపోవడం, పరికరాల పనితీరు, రక్త పరీక్షలు నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంత మంది వైద్యులు ఫోన్‌ చేస్తే ఆస్పత్రికి రావడం, వేలిముద్రలు వేసి బయటకు వెళ్లిపోవడం, పేషెంట్‌కేర్‌, సిబ్బందితో వైద్య సేవలు చేయించడం ఆస్పత్రిలో పరిపాటిగా మారింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి మెరుగైన వైద్య సేవలు అందించేలా చొరవ చూపాలని రోగులు కోరుతున్నారు.

టెస్టుల కోసం మరుసటిరోజు

రావాలన్నారు..

నాలుగు రోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చాను. ఓపీ తీసుకుని వెళ్లగా వైద్యులు లేరు. సిబ్బందిని అడుగగా.. ఏఎంసీకి వెళ్లాలని, లేదంటే రేపు రావాలని తెలిపారు. ఏఎంసీలో వైద్యులను కలువగా మందులు రాసి టెస్టులు ఈరోజు కావు .. మరల రావాలని సూచించారు. వైద్యులు సమయానికి అందుబాటులో ఉండేలా చూడాలి.

–జి.అశోక్‌, కురవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement