సాక్షి, మహబూబాబాద్: అన్ని అర్హతలు ఉన్న వారిని కాదని.. డబ్బులు ఇచ్చిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టారు. జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలోని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు చదివిన ఉమ్మడి రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వెళ్లి సర్టిఫికెట్లను పరిశీలించి ఒరిజినల్ అని తేల్చారు. అయితే మెమోలపై పేర్లు, మార్కులను మార్చి ఉద్యోగాలు పొందినవారి గుట్టు తేల్చాల్సి ఉంది. అలాగే డబ్బుల కొరతతో ఇతర రాష్ట్రాల్లో చదివిన వారి సర్టిఫికెట్ల పరిశీలనలో తాత్సారం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలోని
యూనివర్సిటీల సర్టిఫికెట్లు ఓకే..
జిల్లాలో 140 హెల్త్ సబ్‌సెంటర్లలో ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న 112 మంది, అదేవిధంగా డైక్ సెంటర్‌లో పనిచేస్తున్న వారి సర్టిఫికెట్లు పరిశీలించారు. అయితే ఇందులో 58 మంది అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య యూనివర్సిటీ, ఏపీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. ఆయా యూనివర్సిటీలకు సర్టిఫికెట్లు పంపించి పరిశీలంచాలని కోరినట్లు తెలిసింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో చదివిన వారి సర్టిపికెట్లు ఒరిజినల్ అని తేల్చారు. అయితే సర్టిఫికెట్లు ఒరిజనలే... కానీ మెమోలపై పేర్లు, మార్కులను మార్చి ఉద్యోగాలు పొందినవారి గుట్ట తేల్సాల్సి ఉంది.
ఇతర రాష్ట్రాల వర్సిటీల
సర్టిఫికెట్లు పరిశీలించాలి
ఎంఎల్‌హెచ్‌పీ ఉద్యోగ నియామకాల్లో అవకవతకలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు అందరి సర్టిఫికెట్ల పరిశీలన చేస్తున్నాం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పరిధిలో చదివిన వారి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయ్యింది. ఇతర రాష్ట్రాల్లో చదివిన వారి సర్టిఫికెట్ల పరిశీలన కోసం డబ్బులు చెల్లించాలి. ఆ డబ్బులకోసం రాష్ట్ర ఉన్నతాధికారులకు లేఖ రాశాం. అక్కడి నుంచి సమాధానం రాగానే ప్రక్రియ మొదలవుతుంది.
– రవిరాథోడ్, జిల్లా వైద్యాధికారి
వైద్యారోగ్యశాఖలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు
నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో మెమోల పరిశీలన
ఇతర రాష్ట్రాల్లో పరిశీలనకు డబ్బుల కొరత
ఏటూ తేలని నకిలీ సర్టిఫికెట్ల ఉద్యోగుల వ్యవహారం


