ఆరుతడి పంటలు సాగు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలు సాగు చేయాలి

Nov 28 2026 12:56 AM | Updated on Nov 28 2026 12:56 AM

నెల్లికుదురు: రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలని ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు సూచించారు. మండలంలోని ఆలేరు గ్రామంలో మండల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో యాసంగిలో నీటి లభ్యత తగ్గుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నట్లు తెలిపారు. వరి పంటను తగ్గించి ఆరుతడి పంటలైన జొన్న, సజ్జలు, పెసర్లు, మినుములు, కంది వంటి పప్పు దినుసుల పంటలు సాగు చేయడం ద్వారా భూసారం కూడా మెరుగుపడుతుందని తెలిపారు. రైతు వేదికల్లో సబ్సిడీపై విత్తనాలు అందిస్తారని చెప్పారు. ఉపసర్పంచ్‌ గన్న హరీష్‌, టెక్నికల్‌ ఏఓ రాంజీ, ఏఓ మహేందర్‌ నాయక్‌, ఐబీ ఏఈ సుష్మ, ఏఈఓలు మణికంఠ, రాజేష్‌, యాకూబ్‌ రైతులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement