మహబూబాబాద్: గ్రంథాలయాలు విశ్వవాప్త విజ్ఞాన భాండాగారాలని, గ్రంథాలయాలను విని యోగించువాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం సరస్వతీదేవి, చాచా నెహ్రూ, గ్రంథాలయ పితామహుడు ఎస్ఆర్ రంగనాథన్ చిత్రపటాలకు చైర్మన్ పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తక పఠనంతో విజ్ఞానం లభిస్తుందని, ఉన్నతంగా ఎదగొచ్చన్నారు. విద్యార్థులకు మానవ జీవన విధానంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ కార్యదర్శి టి.శ్రీలత, లైబ్రేరియన్లు జి.విజేందర్, రుద్రారపు వీరేందర్, కౌన్సిలర్లు బి.రాజు, శివకుమార్, నాయకులు బొడ్డుపల్లి ఉపేంద్రం, రమేశ్, లక్ష్మీనారాయణ, జ్ఞానేశ్వర్, రఘు, భాస్కర్ పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్‌రెడ్డి
గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం


