డోర్నకల్: గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాల్లో గుడుంబా తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి పి.కరంచంద్ తెలిపారు. డోర్నకల్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో గుడుంబా తయారీ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఎకై ్సజ్, స్టేట్ టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్, సివిల్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లావ్యాప్తంగా దాడులు నిర్వహించి గుడుంబా, నల్లబెల్లం, పటిక స్వాధీనం చేసుకుని బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గుడుంబాను అరికట్టేందుకు దాడులు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. విలేకరుల సమావేశంలో మహబూబాబాద్ ఎకై ్సజ్ సీఐ రాంప్రసాద్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఫోర్స్ అధికారులు వెంకటేశ్వర్లు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి పి.కరంచంద్


