కాశిబుగ్గ: వైద్యులుగా సేవలు అందిస్తూ రక్తదానం చేయడం అభినందనీయమని ఎంజీ ఎం సూపరింటెండెంట్ డాక్టర్ కాటం రాంకుమార్‌రెడ్డి అన్నారు. కేఎంసీలో జరుగుతు న్న ఉత్కర్ష–2026 వార్షికోత్సవాల్లో భాగంగా పూర్వ అనాటమీ విభాగాధిపతి డాక్టర్ పద్మజ స్మారకార్థం శనివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్‌దాసు ఆధ్వర్యంలో మెడికోస్ బ్లడ్‌డోనర్స్ క్లబ్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాంకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. వైద్యులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయడం గొప్పసేవా కార్యక్రమం అన్నారు. ఈ సందర్భంగా 50 మంది వైద్య విద్యార్థులు రక్తదానం చేసి 50 యూనిట్ల రక్తాన్ని అందించి, తమ సమాజ సేవను నిరూపించుకున్నారు. కార్యక్రమంలో అనాటమీ విభాగాధిపతి డాక్టర్ శశికాంత్, కమ్యూనిటీ మెడిసిన్ విబాగాధిపతి డాక్టర్ శ్రీదర్, అనాటమీ ప్రొఫెసర్ డాక్టర్ మాధవి, బయోకెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్, ఎంజీఎం బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్ డాక్టర్ సంయుక్త, కళాశాల అధ్యాపకులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
● ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి
● 50 యూనిట్ల రక్తదానం చేసిన వైద్య విద్యార్థులు


