మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

Nov 15 2026 1:20 PM | Updated on Nov 15 2026 1:20 PM

కురవి: విద్యార్థి దశ నుంచే విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని మహబూబా బాద్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జ్జి స్వాతి మురారి సూచించారు. శనివారం జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో, ఎన్‌డీపీఎస్‌ చట్టాలు, సైబర్‌ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా జడ్జి స్వాతి మురారి మాట్లాడుతూ.. యువత డ్రగ్స్‌ బారిన పడి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. బాలల రక్షణ కోసం ప్రభుత్వం కఠి నంగా అమలు చేస్తున్న పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు, పోలీసులకు సమాచారం అందించాలని, 100 లేదా 112కు వెంటనే డయల్‌ చేయాలని సూచించారు. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో విద్యార్థులు సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లను వినియోగించేటప్పుడు అపరిచితులతో స్నేహం చేయడం, వ్యక్తిగత ఫొటోలు లేదా వివరాలు పంచుకోవడం నష్టాలు కలిగిస్తుందన్నారు. చదువుతోపాటు చట్టాలపై అవగాహన పెంచుకోవా లని వివరించారు. కార్యక్రమలో చీఫ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ నాగేశ్వరరావు, సీనియర్‌ అడ్వకేట్‌ మల్లారెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్‌ జేడీ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలి: కలెక్టర్‌

మహబూబాబాద్‌ అర్బన్‌: నర్సింహులపేట మండలంలోని ప్రాథమిక పాఠశాలను కలెక్టర్‌ స్నేహశబరీష్‌ శనివారం సందర్శించారు. పాఠశాలలో కంప్యూటర్‌ ఏఐలో గణితం, ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌ నేర్చుకొని బాగా చదువుకోవాలని పిల్లలకు సూచించారు. అదేవిధంగా కస్తూర్బాగాంధీ విద్యాలయంలో బాలికలు ధైర్యంగా ఉండి అన్నిరంగాల్లో రాణించి దేశప్రగతిలో భాగస్వామ్యం కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలి

మరిపెడ రూరల్‌: రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించి తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్‌ చంద్ర సూచించారు. శనివారం మరిపెడ మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం పల్సన్‌ పథకంలో భాగంగా రైతులకు పెసర విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంటల మార్పిడి విధానాన్ని పాటిస్తూ అపరాల సాగును ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి బోడ వీరసింగ్‌, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు

తొర్రూరు: జిల్లాలోని స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్‌ హెచ్చరించారు. శనివారం డివిజన్‌ కేంద్రంలోని స్కానింగ్‌ సెంటర్లను డీఎంహెచ్‌ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన గర్భిణులపై ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు, స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు వివక్ష చూపవద్దన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు, చేయించేందుకు ప్రయత్నిస్తే సంబంధిత ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక వైద్యులు జలిత, మనోహర్‌, ఇస్మాయిల్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement