లింక్‌ కెనాల్‌తో భూములు కోల్పోతున్నాం.. | - | Sakshi
Sakshi News home page

లింక్‌ కెనాల్‌తో భూములు కోల్పోతున్నాం..

Nov 15 2026 1:26 PM | Updated on Nov 15 2026 1:26 PM

● ఎస్టీ జాతీయ కమిషన్‌ సభ్యుడికి రైతుల వినతి

గార్ల: గార్ల మండలంలో నిర్మించే మున్నేరు టు పాలేరు లింక్‌ కెనాల్‌ వల్ల ఖరీదైన సారవంతమైన భూములను కోల్పోతున్నామని బాధిత గిరిజన రైతులు శనివారం జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌ను కలిసి విన్నవించారు. ఈ లింక్‌ కెనాల్‌ నిర్మాణం వల్ల మండలంలో సుమారు 600 ఎకరాల రైతులకు చెందిన భూములు కోల్పోతుండడంతో.. గార్ల మండలం ఎడారిగా మారే ప్రమాదం ఉన్నందున లింక్‌ కెనాల్‌ను రద్దు చేయించేందుకు కృషి చేయాలని రైతులు ఆయనను వేడుకున్నారు. రైతు ఒప్పందం లేకుండా అధికారులు లింక్‌ కెనాల్‌ కోసం పోలీస్‌ బందోబస్త్‌ పెట్టి తమ భూముల్లో సర్వే నిర్వహించారని ఆయనకు వివరించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయనను కలిసిన వారిలో మున్నేరు రైతు రక్షణ కమిటీ కన్వీనర్‌ మూడు హరినాయక్‌, టీవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంపాల విశ్వ, బీఆర్‌ఎస్‌ మండల నాయకుడు శీలంశెట్టి రమేశ్‌, గిన్నారపు మురళి, బాధిత రైతులు ఎల్‌.శ్రీనాథ్‌, టి.అనిల్‌, యాకూబ్‌ అలీ, సోమ శ్రీకాంత్‌, బి.హనుమంతు, బి.రమేశ్‌, ఎం.సురేశ్‌, ఎం. వాల్యా, ఎం.వీరన్న, ఎం.అశోక్‌, శివాజీ, రాము, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement