17 ఏళ్లుగా తిరుగుతున్నా ఫలితంలేదు.. | - | Sakshi
Sakshi News home page

17 ఏళ్లుగా తిరుగుతున్నా ఫలితంలేదు..

Sep 8 2026 1:41 AM | Updated on Sep 8 2026 1:41 AM

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ మండలం ముడుపుగల్‌ రెవెన్యూ పరిధి సర్వే నంబర్‌ 200లో మా నాన్న తోట పరమేశ్వర్‌ పేరుమీద ఉన్న భూమిలో నుంచి ఎకరం రెండు గుంటలు తోట సత్తయ్య పేరు మీదకు 2009లో మార్పిడి జరిగింది. సత్యయ్యకు 2016లో పాసుపుస్తకం వచ్చింది. మా భూమి మాకు తిరిగి ఎక్కించకుండా రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించాం. ఎంపీడీఓ కార్యాలయంలోనూ ఇప్పటికి రెండుసార్లు అర్జీలు ఇచ్చినప్పటికీ రెవెన్యూ అధికారుల నుంచి కనీసం ఫోన్‌కాల్‌ కూడా రాలేదు. విచారణ నిమిత్తం ఏ ఒక్క అధికారి కూడా స్పందించడం లేదు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోవాల్సి వస్తుంది. మా ఎకరం రెండు గుంటల భూమిని మా పేరు మీదకు మార్చాలి. – తోట సంపత్‌ కుమార్‌, శనిగపురం గ్రామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement