బయ్యారం: ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలాష్టి రమేశ్ అన్నారు. మండలంలోని బయ్యారం, ఇర్సులాపురం, వెంకట్రాంపురం పాఠశాలలను సోమవారం టీపీటీఎఫ్ ప్రతినిధుల బృందం సందర్శించి సమస్యలు తెలుసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో రోజురోజుకూ విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం ప్రభుత్వ లోప భూయిష్ట విధానాలే అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన ముఖ్యమంత్రి ఇటీవల బెంగళూరు కేంద్రంగా ప్రభుత్వ విద్యాసంస్థలను కుదిస్తామని ప్రకటించడం సామాన్యులను విద్యకు దూరం చేయడమేనన్నారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి పులిచింతల విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు కిషన్, భావ్‌సింగ్, వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, సుధాకర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
చెరువు నీటిని విడుదల చేయాలి
బయ్యారం: బయ్యారం పెద్దచెరువు నీటిని కాల్వలకు విడుదల చేయాలని ఆయకట్టు రైతులు ఇరిగేషన్ అధికారులను కోరారు. సోమవారం మండలపరిషత్ కార్యాలయంలో ఆయకట్టు రైతులు, ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయశాఖాధికారులు సమావేశం అయ్యారు. ఆయకట్టు పరిధిలో ప్రస్తుతం సాగులో ఉన్న వరిపంటకు నీరు అవసరం ఉందని, అలుగుల ద్వారా వెళ్తున్న నీటిని కాల్వలకు విడుదల చేయాలని రైతులు కోరారు. అయితే చెరువులో ఉన్న నీటితో ఆయకట్టు మొత్తం సాగు కష్టతరం అవుతుందని ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. నీటిని పొదుపుగా వాడుకొని పంటలను కాపాడుకుంటామని రైతులు అధికారులకు తెలిపా రు. రైతుల అభిప్రాయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నీటి విడుదలపై నిర్ణయం ప్రకటిస్తామని డీఈ సాగర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ దీపిక, ఏఓ రాజు, ఎస్సై ప్రశాంత్‌బాబు, ఇరిగేషన్ ఏఈ అఖిల పాల్గొన్నారు.
ఎరువులు, విత్తన ధరలు ప్రదర్శించాలి
తొర్రూరు: ఎరువులు, విత్తన దుకాణాల్లో ధరల పట్టిక విధిగా ప్రదర్శించాలని ఏడీఏ మురళి తెలిపారు. డివిజన్ కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను సోమవారం వ్యవసాయాధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ మా ట్లాడుతూ.. ప్రతీ డీలర్ రైతులకు రశీదులు వి ధిగా ఇవ్వాలన్నారు. రైతులను మోసగిస్తే లైసె న్స్‌లు రద్దు చేస్తామన్నారు. బోనస్ వచ్చే ఏడు రకాల వరి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు రశీదు తీసుకుని వస్తే ఆన్‌లైన్ చేయాలన్నారు. ఈ నెల 10వరకు ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఏఓ రాంనర్సయ్య, ఏఈఓలు భరత్‌చంద్ర, వినయ్‌వర్మ, దీపిక, ప్రవీణ్ ఉన్నారు.
ఐటీడీఏ ఏపీఓగా దామోదరస్వామి
ఏటూరునాగారం: ఐటీడీఏ ఏపీఓగా తిరునగిరి దామోదరస్వామి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన పీఓ లెనిన్ వత్సల్ టొప్పోను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఏటూరునాగారం ఏఓగా పనిచేసిన దామోదరస్వామి ఉట్నూరుకు బదిలీపై వెళ్లారు. అక్కడ విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగోన్నతిపై ఏటూరునాగారం ఏపీఓగా బదిలీపై వచ్చి విధుల్లో చేరారు.


