అంగన్‌వాడీకి స్థలం ఇచ్చాం.. ఆయా పోస్టు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీకి స్థలం ఇచ్చాం.. ఆయా పోస్టు ఇవ్వాలి

Sep 8 2026 1:41 AM | Updated on Sep 8 2026 1:41 AM

గార్ల: మండలంలోని బాలాజీతండాలో అంగన్‌వాడీ సెంటర్‌ భవన నిర్మాణానికి మా మామ తన సొంత ఇంటి స్థలం ఇచ్చాడు. ఆ సమయంలో అధికారులు మా కుటుంబంలో ఒకరికి ఆయా పోస్టు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల ఆయా రిటైర్డ్‌ అయ్యింది. దీంతో ఆ పోస్టు ఖాళీ అయ్యింది. ప్రస్తుతం మాకు ఇల్లు కూడా లేదు. కూలీ పనులు చేసి బతుకుతున్నాం. ప్రస్తుతం నోటిఫికేషన్‌ వేయడంతో సర్టిఫికెట్ల పరిశీలన చేస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్న నాకే ఆయా పోస్టు కేటాయించాలి.

– నూనావత్‌ స్వప్న, బాలాజీతండా, గార్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement