హన్మకొండ కల్చరల్: శ్రావణమాసంలోని చివరి సోమవారాన్ని పురస్కరించుకుని వేయిస్తంభాల ఆలయంలో రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు రుద్రేశ్వరస్వామికి అఘోర పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. 150 మంది భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో అర్చకులు ప్రణవ్, శ్రవణ్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


