కాజీపేట రూరల్ : కాజీపేట–బల్హార్షా సెక్షన్ల మధ్య గల జమ్మికుంట, పొత్కపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ కమిషనింగ్ కోసం చేపట్టే నాన్ ఇంటర్‌లాకింగ్ వర్క్స్‌తో ఈనెల 9, 10వ తేదీన పలు రైళ్ల రద్దు, పాక్షికంగా రద్దు, రీషెడ్యూలింగ్, రెగ్యులేషన్ చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వోశ్రీధర్ శుక్రవారం తెలిపారు.
10న రద్దయిన రైళ్లు..
ఈ నెల 10వ తేదీన కాజీపేట–సిర్పూర్‌కాగజ్‌నగర్ (17003) రైలు, బల్హార్షా–కాజీపేట (17004) రైలును రద్దు చేశారు.
పాక్షికంగా రద్దయిన రైళ్లు..
10వ తేదీన భద్రాచలంరోడ్–బల్హార్షా (17033) సింగరేణి వరంగల్–బల్హార్షా మధ్య, సిర్పూర్‌టౌన్–భద్రాచలంరోడ్ (17034) సింగరేణి సిర్పూర్‌టౌన్–వరంగల్ మధ్య, హైదరాబాద్–సిర్పూర్‌కాగజ్‌నగర్ (17011) ఇంటర్‌సిటీ కాజీపేట–సిర్పూర్‌కాగజ్‌నగర్ మధ్య, సిర్పూర్‌కాగజ్‌నగర్–బీదర్ (17012) బీదర్ ఎక్స్‌ప్రెస్ సిర్పూర్‌కాగజ్‌నగర్–కాజీపేట మధ్య రద్దు చేశారు.
రీషెడ్యూలింగ్ ఆఫ్ ట్రైన్స్..
10వ తేదీన సికింద్రాబాద్–సిర్పూర్‌కాగజ్‌నగర్ (17233) ఎక్స్‌ప్రెస్ గంట, సిర్పూర్ టౌన్–కరీంనగర్ (6777) పుష్‌పుల్ గంట, కరీంనగర్–బోధన్ (67773) పుష్‌పుల్ గంట రీషెడ్యూలింగ్‌తో నడవనున్నాయి.
రెగ్యులేషన్ ఆఫ్ ట్రైన్స్..
ఈ నెల 9వ తేదీన వరంగల్ మీదుగా వెళ్లే దానాపూర్–ఎస్‌ఎంవీటీ బెంగళూరు (22365) ఎక్స్‌ప్రెస్ 75 నిమిషాలు, ఎస్‌ఎంవీటీ బెంగళూరు–దానాపూర్ (22366) ఎక్స్‌ప్రెస్ 45 నిమిషాలు, న్యూఢిల్లీ–చైన్నె సెంట్రల్ (12622) ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు, ఈ నెల 10న చైన్నె సెంట్రల్–ఎంఎంవీడీ కాట్రా (160 31) ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు రెగ్యులేషన్ చేశారు.
రెండు రైళ్లు రద్దు, నాలుగు పాక్షికంగా..
ఈ నెల 9, 10వ తేదీల్లో చేపట్టనున్న రైల్వే బ్లాక్


