ఎంబీబీఎస్ సీటు సాధించిన నల్ల శ్వేత
లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం జీడికల్ గ్రామానికి చెందిన నల్ల శ్వేత నీట్‌లో ర్యాంకు సాధించి వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. మంజుల, భిక్షపతి దంపతులకు కూతురు శ్వేత, కుమారులు చందు, శ్రావణ్ ఉన్నారు. శ్వేత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివింది. 2020లో పదో తరగతి పూర్తి చేసింది. ఆ తర్వాత 2022లో జఫర్‌గఢ్ బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంది. 2025–2026లో నీట్ పరీక్షలో ర్యాంకు సాధించి కేఎంసీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. దీనిపై తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు శ్వేతను అభినందించారు.


