కేఎంసీలో సీటు సాధించిన వేదశ్రీ..
దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన ఈదుల వీరస్వామి, పద్మ దంపతుల కూతురు వేదశ్రీ నీట్‌లో 469 మార్కులు సాధించి వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీటు సాధించింది. ఎస్సీ కాలనీలో తొలిసారి మెడిసిన్ సీటు సాధించిన విద్యార్థినిగా వేదశ్రీ నిలిచింది. ఈమేరకు వేదశ్రీని సర్పంచ్ మోడెం శ్రీలతామల్లేశం, గ్రామస్తులు అభినందించారు. కాగా, వేదశ్రీ టెన్త్ వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివింది.


