రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు

Sep 5 2026 5:43 AM | Updated on Sep 5 2026 5:43 AM

జనగామ: రాష్ట్రాన్ని దొంగల మాదిరి దోపిడీ చేస్తూ ప్రజాపాలన అని చెప్పుకోవడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సిగ్గు లేదా అని మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆచరణ సాధ్యం కాని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు నీళ్లు, విద్యుత్‌ కోసం ప్రజలు అల్లాడిపోయారని, కానీ కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చాక 24 గంటల విద్యుత్‌ సరఫరా, చెరువుల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్ట్‌ నిర్మాణంతో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్‌, నీటి సమస్యలు ఎందుకు వచ్చాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అన్నదాతలకు రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు అందించి అండగా నిలిచామని చెప్పారు. వారసత్వంగా వచ్చిన, పేదల ఇళ్లు, భూములను 22 ఏ పరిధిలోకి తీసుకొచ్చే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజలు కూడా కాంగ్రెస్‌ పాలనతో విసిగిపోయారని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పాలిటెక్నిక్‌ కళాశాలలకు సంబంధించిన జీఓ నంబర్‌ 97ను ఈ నెల 7లోగా రద్దు చేయకపోతే లక్ష మంది విద్యార్థులతో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీ సంబంధిత వర్గాలతో చర్చించి జీఓ రద్దుకు సిఫారసులు చేయాలన్నారు. టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌, గొర్రెలు, మేకల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, పెద్దిరాజిరెడ్డి, గద్దల నర్సింగారావు, ధర్మపురి శ్రీనివాస్‌, కొమ్ము రాజు, తిరుమలరెడ్డి, గునిగంటి రామకృష్ణ, ఉల్లెంగుల సందీప్‌, రేఖరాజు, నీల యాదగిరి, సేవెల్లి మధు, సుధాకర్‌, ఎనగందుల కృష్ణ, సువార్త, గోపగోని సుగుణాకర్‌ గౌడ్‌, ఉల్లెంగుల నర్సింగ్‌, సంపత్‌, దేవర రాజు, బొల్లం శారత, జాయ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement