నగదు, ఆభరణాల దొంగల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నగదు, ఆభరణాల దొంగల అరెస్ట్‌

Sep 5 2026 5:37 AM | Updated on Sep 5 2026 5:37 AM

నగదు, ఆభరణాల దొంగల అరెస్ట్‌

గార్ల: మండలంలోని మర్రిగూడెం క్రాస్‌రోడ్డు వద్ద పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులను చూసి పారిపోతున్న ఇద్దరిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.2,15,100 విలువ చేసే బంగారు, వెండి ఆభరణాల ప్రాపర్టీని రికవరీ చేసినట్లు ఎస్సై బి.సాయికుమార్‌ శుక్రవారం వెల్లడించారు. ఎస్సై కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గార్ల మండలం రాంపురం గ్రామానికి చెందిన చింత యుగంధర్‌, బోడ సాంబశివరావులు ఇటీవల గార్ల గ్రామ పంచాయతీ జీవంజిపల్లిలోని కొణతం సత్యనారాయణరెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడి, బీరువాలోని రూ.20వేల విలువ గల విదేశీ కరెన్సీ నాణేలు, రూ.2,400నగదు ఎత్తుకెళ్లారు. అదే రోజు రాత్రి వీరిద్దరు కలిసి మహబూబాబాద్‌లోని హస్తినపురంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడి బంగారు మంగళ సూత్రాలు, చైన్‌, రెండు జతల పట్టీలు చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి సొమ్ము రికవరీ చేసుకొని అరెస్ట్‌ చేసి రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు ఎస్సై సాయికుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement