ఎగుమతి పెరిగితే మంచిరోజులు.. | - | Sakshi
Sakshi News home page

ఎగుమతి పెరిగితే మంచిరోజులు..

Sep 5 2026 5:37 AM | Updated on Sep 5 2026 5:37 AM

20ఏళ్లుగా రెండున్నర ఎకరాల్లో మిర్చి పంట సాగు చేస్తున్న. 50 క్వింటాళ్ల వరకు దిగుమతి వస్తుంది. ఎగుమతి ఉన్నప్పుడు ధర మంచిగానే ఉంటుంది. ఎగుమతులు నిలిచిపోతే ధర తగ్గించి కొంటున్నారు. ప్రభుత్వమే ఎగుమతి చేస్తే రైతులకు మంచి రోజులు వస్తాయి.

– గుగులోత్‌ కిషన్‌ నాయక్‌, రైతు, ఛాంప్లానాయక్‌ తండా

రైతులను ప్రోత్సహించినట్లే..

20 ఏళ్లుగా మామిడితోట సాగు చేస్తున్న. కాయలకు కవర్లు పెట్టి సాగు చేస్తున్నాం. ముసుగు మామిడికి ఇతర దేశాల్లో డిమాండ్‌ ఉంది. కానీ ఎగుమతి లేకపోవడంతో ఆశించిన స్థాయిలో లాభాలు రావడం లేదు. ప్రభుత్వం ఎగుమతి చేసే బాధ్యత తీసుకుంటే మామిడి రైతులకు మరింత ప్రోత్సాహం కలుగుతుంది. – మర్రు వేణు, మామిడిరైతు, మల్యాల

పసుపు బంగారమే..

మా గ్రామంలో నాతోపాటు మరో 20 మంది రైతులు పసుపు పండిస్తాం. ధర పడిపోవడం, ఎగుమతులు లేకపోవడంతో సాగు తగ్గింది. గతేడాది మంచి ధర వచ్చింది. ఈ ఏడాది కూడా ఐదెకరాల్లో పసుపు సాగు చేశాను. ఎగుమతులు పెంచితే పసుపు పండించడమంటే బంగారం పండించడమే. – కొండ్రెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నర్సింహులపేట

సాగు పెరుగుతుంది..

జిల్లాలో మిర్చి, మామిడి, పసుపు పండించే రైతులు ఎక్కువగా ఉన్నారు. ధరలో హెచ్చు తగ్గులతో ఇబ్బందులు పడి వరి సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఎగుమతుల కేంద్రంగా మహబూబాబాద్‌ను ఎంపిక చేయడంతో మిర్చి, పసుపు, మామిడి సాగు విస్తీర్ణం పెరుగుతుంది.

– జిలుగు మరియన్న, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement