మహబూబాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లాకేంద్రంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ బాకీలు చెల్లించేంత వరకు ఉద్యమం ఆగదన్నారు. హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మానుకోట ఎమ్మెల్యే మురళీనాయక్ జిల్లాకేంద్రంలోని గుమ్ముడూర్ ప్రాంతాన్ని రెడ్ లైట్ ఏరియా అనడం బాధాకరమన్నారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఇవ్వడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుల పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, మార్నెని వెంకన్న, ఫరీద్, గద్దె రవి, గుండా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు


