దేశానికే రోల్‌ మోడల్‌ కాంగ్రెస్‌ పాలన | - | Sakshi
Sakshi News home page

దేశానికే రోల్‌ మోడల్‌ కాంగ్రెస్‌ పాలన

Sep 4 2026 7:47 AM | Updated on Sep 4 2026 7:47 AM

ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌

మహబూబాబాద్‌ రూరల్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభు త్వ వెయ్యి రోజుల పాలన దేశానికే రోల్‌ మోడల్‌గా మారిందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ పోరిక బలరాంనాయక్‌, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమతో కలిసి ఎమ్మెల్యే మురళీనాయక్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అధి కారంలోకి వచ్చాక ఒక్క మహబూబాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోనే రూ.3వేల కోట్లతో సీసీ రోడ్లు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, చెరువుల సుందరీకరణ, ఇంటిగ్రేటెడ్‌ హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, వీఓ భవనాలు, వివిధ కళాశాలల నిర్మాణం, రైల్వే పీరియాడికల్‌ ఓవర్‌ హాలింగ్‌ పరిశ్రమ, తదితర అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. సొంత చెల్లెలు తనకు రాఖీ కట్టవద్దని విదేశాలకు వెళ్లిన మాజీ మంత్రి కేటీఆర్‌ మహిళలను ఎలా గౌరవిస్తారని ఎంపీ పోరిక బలరాంనాయక్‌ ప్రశ్నించారు. రక్త సంబంధాన్ని గౌరవించని వ్యక్తి ప్రజలను ఎలా గౌరవిస్తారో చెప్పాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుగులోత్‌ జ్యోతి, కాంగ్రెస్‌ అర్బన్‌ అధ్యక్షుడు ఘనపురపు అంజయ్య, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, సమ్మిగౌడ్‌, అశోక్‌, బాలాజీ, కౌన్సిలర్లు శివకుమార్‌, రవినా యక్‌, దిలీప్‌, మాధవి, సరిత, రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాహుల్‌గాంధీపై కేసు ఉపసంహరించాలి

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎంపీ పోరిక బలరాంనాయక్‌, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ డిమాండ్‌ చేశారు. ‘అన్యాయ ఎఫ్‌ఐఆర్‌ వద్దు.. న్యాయం కావాలి’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ సెంటర్‌ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడి గొంతు నొక్కడానికి కేసులు, బెదిరింపులు, దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదన్నారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జ్యోతి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ మదన్‌ గోపాల్‌ లోయ, డీవైసీ అధ్యక్షుడు సురేష్‌ నాయక్‌, జిల్లా ఎస్టీ సెల్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు ప్రసాద్‌ నాయక్‌, శ్రీధర్‌, నాయకులు రమేష్‌, వంశీ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement