గీసుకొండ/ఖిలా వరంగల్ : వరంగల్ నగరంలో కాంగ్రెస్ నాయకుడు అడప మహేశ్ సజీవ దహనం, హత్య కేసులో ఏ3గా ఉన్న జన్ను మధు(42) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఉదయం చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. గీసుకొండ పరిధి కోటిలింగాల గుడి సమీపంలో గత జూలై 18న మహేశ్‌పై రౌడీషీటర్ పత్తి కుమార్ పెట్రోల్ పోసి నిప్పంటించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ కేసులో జన్ను మధు ఏ3గా ఉన్నాడు. నిందితులను అదే నెల 25న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆగస్టు 15న వారంతా బెయిల్‌పై విడుదలయ్యారు. మధు కొంతకాలంగా కిడ్నీ వ్యాధితోపాటు చలిజ్వరం, ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఇటీవల కిడ్నీనొప్పి తీవ్రంకాగా ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లగా తుంటికి ఇంజక్షన్ ఇచ్చాడని, అది ఇన్‌ఫెక్షన్ అయి పెద్దగడ్డ ఏర్పడిందని స్థానికులు తెలిపారు. అతడిని మెరుగైన చికిత్స కోసం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మంగళవారం ఉదయం మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. కాగా, సెంట్రింగ్ పనిచేసే మధుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అడప మహేశ్ సజీవ దహనం కేసులో ఏ3గా ఉన్న మధు


