● అస్వస్థతతో పొలంలో పడి రైతు మృతి
● గాజులగట్టు శివారులో ఘటన
గూడూరు: వరి పైరుకు పురుగు మందు పిచికారీ చేస్తూ అస్వస్థతతో ఓ రైతు పొలంలోనే మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని చకృతండాకు చెందిన ధరంసోతు రాముడు (35) గాజులగట్టు శివారులోని తన వరి పంటలో పంపు ద్వారా పురుగు మందు పిచికారీ చేస్తున్నాడు. ఈ క్రమంలో అస్వస్థతకు గురై పొలంలో పడి మృతిచెందాడు. కొంత సమయం తర్వాత పంపు శబ్దం వినబడుతూ రాముడు కనిపించకపోవడంతో సమీపంలోని మరో రైతు వెళ్లి చూడగా రాముడు మృతి చెంది కనిపించాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై రమేశ్‌బాబు తెలిపారు.


