హసన్‌పర్తి : హసన్‌పర్తి మండలం అన్నాసాగరం శివారులోని ఎస్సార్ యూనివర్సిటీలో ఎస్‌ఐబీ–2026 ఇంటర్నల్ హ్యాక్ థాన్ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో బి.టెక్ విద్యార్థులతో కూడిన సుమారు 300 బృందాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. వంద మంది అధ్యాపకులు మోంటార్లు, కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు. ఈసందర్భంగా డీన్ డాక్టర్ శశికళ మాట్లాడుతూ విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న సైద్ధాంతిక పరిజ్ఞానాన్ని వాస్తవ ప్రపంచ సమస్యల పరిష్కారానికి హ్యాక్‌థాన్‌లు గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయన్నారు. విద్యార్థుల్లో పెరుగుతున్న ఆవిష్కరణ, సమస్యల పరిష్కార స్ఫూ ర్తికి నిదర్శనమన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనా త్మక శక్తులు, సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయన్నారు. డాక్టర్ సందీప్, డాక్టర్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.


