అష్ట తీర్థాల ఘాట్ల విస్తరణ టెండర్‌కు దరఖాస్తులు నిల్‌ | - | Sakshi
Sakshi News home page

అష్ట తీర్థాల ఘాట్ల విస్తరణ టెండర్‌కు దరఖాస్తులు నిల్‌

Sep 4 2026 7:47 AM | Updated on Sep 4 2026 7:47 AM

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మ హదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు జరగనున్న గోదావరి నది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం అష్ట తీర్థాల ఘాట్ల విస్తరణకు ఇరిగేషన్‌శాఖకు రూ.60 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా, గత నెల 17న టెండర్లకు దరఖాస్తులు ఆహ్వానించగా సాంకేతిక కారణాలతో వాయిదా వేశారని తెలిసింది. మ ళ్లీ ఆగస్టు 31న టెండర్లు నిర్వహించగా ఒక్క ద రఖాస్తు కూడా రానట్లు సమాచారం. దీంతో టెండర్లు వేయడగానికి కాంట్రాక్టర్లు వెనుకంజ వేస్తున్నట్లు తెలిసింది. ఫలితంగా టెండర్లపై అ యోమయం నెలకొందని చర్చ జరుగుతోంది.

విదేశీగడ్డపై అంతర్జాతీయ ఫార్మసీ సదస్సులో అవార్డులు

హన్మకొండ : కెనడాలోని మాంట్య్రాల నగరంలో జరుగుతున్న 84వ అంతర్జాతీయ ఫార్మసీ సదస్సులో హనుమకొండ విద్యానగర్‌లోని సెయింట్‌ పీటర్స్‌ ఫార్మసీ కళాశాల అధ్యాపకులు అవార్డులు అందుకున్నారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 2వ తేదీ వరకు అంతర్జాతీయ సదస్సు జరిగింది. నిర్వాహకుల ఆహ్వానంతో కళాశాల నుంచి డాక్టర్‌ ప్రవీణ్‌ దేవానందన్‌, డాక్టర్‌ రణధీర్‌ చౌదరి సదస్సులో పాల్గొన్నారు. 120 దేశాల నుంచి ఫార్మసీ మేధావులు, వ్యాపారవేత్తలు, నిపుణులు, యూనివర్సిటీ, ఫార్మసీ కళాశాల ఆచార్యులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఇందులో కళాశాల అధ్యాపకుడు డాక్టర్‌ ప్రవీణ్‌ దేవానందన్‌ ప్రతిష్టాత్మక ఎఫ్‌ఐపీ ఫౌండేషన్‌ అండ్‌ ఎర్లీ కెరీర్‌ ప్రోగ్రాం గైడ్‌ అవార్డు అందుకున్నారు. ఇదే కళాశాలకు చెందిన డాక్టర్‌ రణధీర్‌ చౌదరికి ఎర్లీ కెరీర్‌ లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో స్కాలర్‌షిప్‌ అందించారు. అవార్డులు అందుకోవడం జిల్లాకు గర్వకారణమని కళాశాల చైర్మన్‌ జైపా ల్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ రాజశ్రీ తెలిపారు.

చెక్‌ బౌన్స్‌ కేసులో వ్యక్తికి ఏడాది జైలు, జరిమానా

జనగామ : చెక్‌ బౌన్స్‌ కేసులో జనగామ ప్రిన్సిపల్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఫస్ట్‌క్లాస్‌ కోర్టు.. ఓ వ్యక్తికి ఏడాది జైలుతోపాటు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. అడ్వకేట్‌ శ్రీరామ్‌ శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామకు చెందిన బి.నాగరాజు రియల్‌ ఎస్టేట్‌ విక్రయాలకు సంబంధించి హైదరాబాద్‌ కాచిగూడ, లింగంపల్లికి చెందిన టి.వెంకట్రావుతో రూ.50 లక్షల విలువైన అగ్రిమెంట్‌ చేసుకున్నారు. అనంతరం అగ్రిమెంట్‌ను రద్దు చేసుకునే సమయంలో వెంకట్రావు రూ.15 లక్షల చొప్పున నాలుగు చెక్కులను నాగరాజుకు అందజేశారు. ఆ చెక్కులను నాగరాజు బ్యాంకులో జమ చేయగా నగదు లేకపోవడంతో బౌన్స్‌ అయ్యాయి. దీంతో 2023లో నాగరాజు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నాగరాజు తరఫున అడ్వకేట్‌ శ్రీరామ్‌ శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. నాలుగు చెక్కులకు సంబంధించి ఒక్కో చెక్కురూ.15 లక్షలతోపాటు రూ.5 లక్షల జరిమానా చొప్పున మొత్తం రూ.80 లక్షలు నాగరాజుకు చెల్లించాలని విచారణ అనంతరం ప్రిన్సిపల్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఫస్ట్‌క్లాస్‌ కోర్టు న్యాయమూర్తి జి.శశి తీర్పు వెలువరించారు. అలాగే, ఒక్కో చెక్కుకు రూ.10 వేల చొప్పున కోర్టులో డిపాజిట్‌ చేయాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నట్లు అడ్వకేట్‌ శ్రీనివాస్‌ తెలిపారు. కాగా, వెంకట్రావును చర్లపల్లి జైలుకు తరలించినట్లు అడ్వకేట్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement